భారతీయ రిజర్వ్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డు వాడే వారికి శుభవార్త తెలియజేసింది. కస్టమర్లకు ప్రయోజనం కలిగించేలా ఒక డ్రాఫ్ట్ సర్క్యూలర్ జారీ చేసింది.
ఆర్.బి.ఐ.. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్ లకు పెద్దన్న లాంటిది. ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులను తీసుకొస్తూ.. అటు బ్యాంకులకు, ఇటు ఖాతాదారులకు మంచి జరిగేలా ఆర్థిక క్రమబద్దీకరణ చేయడం దీని పని. ఆర్.బి.ఐ. తీసుకొచ్చిన రూల్స్ ఖాతాదారులకు సేవలను సులభతరం చేసేందుకు కృషి చేస్తాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నో మార్పులు తీసుకొచ్చిన ఆర్బీఐ తాజాగా మరో సంచలన ప్రకటన చేసింది. ఇది ఇప్పుడు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వాడే ఖాతాదారులకు లాభం చేకుర్చేలా ఉంది. ఇంతకీ ఆర్బీఐ నుండి వచ్చిన ఆ గుడ్న్యూస్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.
బ్యాంకులు లేదా ఇతర డెబిట్, క్రెడిట్ కార్డులు జారీ చేసే ఆర్థిక సంస్థలు.. వాటి కార్డుల్ని ఒకటి కంటే ఎక్కువ నెట్వర్క్స్పై జారీ చేయాల్సి ఉంటుంది. అంటే కస్టమర్లకు ఇకపై మల్టిపుల్ కార్డ్ నెట్వర్క్స్ ఆప్షన్ అందుబాటులోకి రానుంది. కస్టమర్లు వారికి కావలసిన నెట్వర్క్స్ కు మారేందుకు వెసుటుబాటు కల్పించింది. ప్రస్తుతానికి ఈ ఆప్షన్ అందుబాటులో లేదు. తర్వాత కాలంలో ఏ సమయంలోనైనా ఇతర కార్డు నెట్ర్క్స్కైనా మారేందుకు అవకాశం ఉంటుంది. దీనితోపాటు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కార్డులను జారీ చేసేటప్పుడు కార్డ్ నెట్వర్క్స్ సంస్థలతో ఎలాంటి అగ్రిమెంట్స్ చేసుకోకూడదు. వేరే నెట్వర్క్ నుంచి సేవలు పొందకుండా అడ్డుకోరాదు. కార్డులు పంపిణీ చేసే సంస్థలు, ఇతర నెట్వర్క్ సంస్థలు కచ్చితంగా ఆర్ బీ ఐ కొత్త రూల్స్ అనుసరించాల్సిందే. ఈ సూచనలకు సంబంధించి డ్రాఫ్ట్ సర్క్యూలర్ ఆర్ బీఐ ఇష్యూ చేసింది. దీనిపై ఆగస్టు 4 వరకు ప్రజాభిప్రాయాన్ని కోరుతోంది. ఖాతాదారుల అభిప్రాయాల మేరకు అమలుపరచనుంది.
తాజాగా ఆర్బీఐ బుధవారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన రెండు బ్యాంకుల లైసెన్స్ రద్దు చేసినట్లు ప్రకటన విడుదల చేసింది. రద్దు చేసిన బ్యాంకుల్లో ఒకటి మహారాష్ట్రలోని మల్కాపుర్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్, మరొకటి కర్ణాటకలోని శుష్రుతి సౌహార్ద సహకార బ్యాంక్. ఇకపై ఈ రెండు బ్యాంకులు కనిపించవు. ఈ బ్యాంకుల్లో మూలధనం లేదని.. లాభాలు కనిపించడం లేదని ఆర్ బీ ఐ తక్షణమే ఈ బ్యాంకుల సేవలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనితో బ్యాంక్ ఖాతాదారులకు క్రెడిట్ గ్యారంటీ స్కీం కింద డిపాజిట్ చేసిన వారికి రూ. 5 లక్షల చొప్పున వస్తాయని తెలిపింది.