హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్ డీఎఫ్ సీ.. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో విలీనం కానుంది. ఇదే విషయంపై జూన్ 30న హెచ్ డీఎఫ్ సీ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు సమావేశం కానున్నాయి.
హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అయిన హెచ్ డీఎఫ్ సీని హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో విలీనానికి దాదాపుగా ముహుర్తం ఖరారైంది. దీంతో ఇక నుంచి హెఎచ్ డీఎఫ్ సీ కనిపించదనేది వాస్తవం. అయితే, ఈ క్రమంలోనే హెచ్ డీఎఫ్ సీ కనిపించదు అంటే చాలా మంది కన్ ఫ్యూజన్ లోకి వెళ్లిపోతున్నారు. నిజంగానే ఇక నుంచి హెఎచ్ డీఎఫ్ సీ బ్యాంకు కనిపించదా? అందులో బ్యాంక్ ఖాతా ఉన్న మా పరిస్థితి ఏంటని అనేక మంది ఖాతాదారులు భయందోళనలకు గురవుతున్నారు. అసలు హెచ్ డీఎఫ్ సీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఏంటి? విలీనం ఏంటనే పూర్తి సమాచారం ఇప్పుడు మీ కోసం.
హెచ్ డీఎఫ్ సీ అంటే?
హెచ్ డీఎఫ్ సీ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ రెండు వేరు వేరు. రెండు ఒకటే అని చాలా మంది అపొహపడుతున్నారు. ముందుగా హెచ్ డీఎఫ్ సీ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. హెచ్ డీఎఫ్ సీ అంటే.. ఇదోక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ. గృహ రుణాల ఇవ్వడంలో మొన్నటి వరకు దిగ్గజ కంపెనీగా పేరు పొందింది. ఈ సంస్థలో ఇప్పటికీ ఎంతో మంది రుణాలు తీసుకున్నారు. ఇల్లు, దుకాణం, ఇతర ఆస్తుల కొనుగోలు విషయంలో రుణాలు పొందాలనుకునేవారికి ఈ సంస్థ రుణాలను అందించడంలో సహాయపడింది. ఇది బ్యాంకు కాదు, ఓ ఫైనాన్స్ కంపెనీ.
హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు..
హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు.. మన దేశంలో ఇదోక అతి పెద్ద బ్యాంకింగ్ సంస్థ. ఇండియాలో అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటిగా నిలిచింది హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు. హెచ్ డీఎఫ్ సీ ఫైనాన్స్ కంపెనీ మాదిరిగానే ఇది కూడా ఖాతాదారులకు అన్ని రకాల రుణాలను అందిస్తుంది. దేశ వ్యాప్తంగా ఈ బ్యాంకుల్లో ఎంతో మంది ఖాతాదారులు ఉండడం విశేషం. ఇక ఈ బ్యాంకు మారిన టెక్నాలజీని అనుసరిస్తూ ఖాతాదారులకు లావా దేవిల విషయంలో సులువైన మార్గలను తీసుకురావడానికి అనునిత్యం ప్రయత్నిస్తుంటుంది. కాగా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు మిగతా బ్యాంకులతో పోటీ పడుతూ కస్టమర్లను అనేక సేవలు అందించడంలో ముందుండడం విశేషం.
ఇదిలా ఉంటే.. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో హెచ్ డీఎఫ్ సీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ విలీనానికి ముహూర్తం ఖరారైంది. దీనికి సంబంధించి వీటి మధ్య గతేడాది ఏప్రిల్ 4న ఒప్పందం కూడా కుదిరింది. హెచ్ డీఎఫ్ సీని టేక్ ఓవర్ చేస్తున్నట్లు హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు సైతం ప్రకటించడం విశేషం. అయితే, ఈ ఒప్పందం విలువ దాదాపు 40 బిలియన్ డాలర్లుగా తెలుస్తుంది. ఈ ప్రక్రియ జులై 1 నుంచి అమల్లోకి రానుంది. దీనిపై హెచ్ డీఎఫ్ సీ చైర్మన్ దీపక్ ఫరేక్ సైతం స్పందించి.. జూన్ 30న హెచ్ డీఎఫ్ సీ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు సమావేశమవుతాయని తెలిపారు. ఈ మీటింగ్ లోనే విలీనానికి సంబంధించి ఆమోద ముద్ర కూడా వేస్తాయని కూడా వివరించారు. ఇక ఈ విలీనం తర్వాత హెచ్ డీఎఫ్ సీ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో కలిసిపోతుంది. తద్వారా హెచ్ డీఎఫ్ సీ కనిపించదు.