హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు శుభవార్త! ఉచితంగానే రూ. 5 లక్షల ప్రయోజం పొందనున్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనం కారణంగా ఈ ప్రయోజనం పొందొచ్చు.
హెచ్డీఎఫ్సీ ఇప్పటికే హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో విలీనం అయిపోయిన విషయం తెలిసిందే. హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో హెచ్డీఎఫ్సీ విలీనం తర్వాత ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద బ్యాంక్‌గా.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అవతరించిందని చెప్పుకోవచ్చు. ఈ బ్యాంక్ సేవలు ప్రజలకు అతి చేరువలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విలీనం ద్వారా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సేవలు మరింత విస్తరించే అవకాశం ఉంది. దీని వల్ల హెచ్డీఎఫ్సీ ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుంది. హెచ్డీఎఫ్సీ ఫిక్స్డ్ డిపాజిట్లలో డబ్బులు దాచుకున్నవారికి కూడా రూ. 5 లక్షల ఇన్సూరెన్స్ బెనిఫిట్ వర్తించబోతోంది. ఆ వివరాలు ఏంటో మనం పూర్తిగా తెలుసుకుందాం..
హెచ్డీఎఫ్సీ ఫిక్స్డ్ డిపాజిట్లలో మనీ సేవ్ చేసుకున్నవారికి రూ. 5 లక్షల ఇన్యూరెన్స్ లభిస్తుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) రూల్స్ ఇకనుండి హెచ్డీఎఫ్సీ ఖాతాదారులకు కూడా వర్తించనున్నాయి. దీని వల్ల హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. డీఐసీజీసీ నిబంధనల ప్రకారం చూస్తే.. షెడ్యూల్డ్ బ్యాంక్‌లో రూ. 5 లక్షల వరకు డిపాజిట్లకు ఇన్సూరెన్స్ లభిస్తుంది. దీనితోపాటుగా హెచ్డీఎఫ్సీ ఫిక్స్డ్ డిపాజిల్టు మెచ్చురిటీ వరకు కొనసాగుతాయి. టెన్యూర్, వడ్డీరేటులలో ఎటువంటి మార్పులు ఉండవు. ఖాతాదారులకు FD అకౌంట్ నెంబర్ కూడా మారదు.
జూన్ 30 కన్నా ముందు హెచ్‌డీఎఫ్‌సీలో ఎఫ్డీ అకౌంట్ ఉన్నవారికి మాత్రమే హెచ్డీఎఫ్సీ పోర్టల్‌లో చూడటానికి అందుబాటులో ఉంటాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు అయితే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ విలీనం తర్వాత ఐడీఎఫ్సీ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ కూడా ఆ దారిలోనే వెళుతున్నాయి. ఐడీఎఫ్సీ బ్యాంక్‌లో ఐడీఎఫ్సీ సంస్థ విలీనం కానుంది. ఐడీఎఫ్సీ బ్యాంక్ కూడా సేవలు మరింత విస్తరించనున్నాయి.