మన దేశ ఆర్థిక రంగంలో ప్రైవేటు సంస్థలుగా కొనసాగుతున్న హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనం జులై 1 నుండి అమలుకానుంది. హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విలీనం తర్వాత , హెచ్‌డిఎఫ్‌సి కనిపించదు.
దేశం ఆర్థికాభివృద్ధి సాధించాలంటే బ్యాంకింగ్ వ్యవస్థ కీలకమైనది. రెండు లేదా అంతకంటె ఎక్కువ బ్యాంకులు కలిసి ఒకటే కొత్త బ్యాంక్ గా రూపొందించడాన్ని విలీనం అంటారు. ఈ రంగంలో బ్యాంకులను విలీనం చేయడం ద్వారా ఏర్పడిన బ్యాంకు కొత్త బ్రాంచ్‌లను విస్తరించడం ద్వారా బ్యాంక్ సేవలు మెరుగుపడతాయి. విలీనం తర్వాత బ్యాంకుల నష్టాలు, రుణాలకు సంబంధించిన విషయాలలో రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది. విలీనం ద్వారా బ్యాంక్ సామర్థ్యం పెంచుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. మార్కెట్ లోని పోటీతత్వాన్ని తట్టుకునే శక్తిని పెంపొందుతుంది. మన దేశ ఆర్థిక రంగంలో ప్రైవేటు సంస్థలుగా కొనసాగుతున్న హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనం జూలై 1 నుండి అమలుకానుంది.
హెచ్డీఎఫ్సీ అనేది హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ. దుకాణం, ఇల్లు, ఇతర ఆస్తుల కొనుగోలు విషయాలలో రుణాలకు సదుపాయం కల్పించేది. అలాగే హెచ్డీఎఫ్సీ బ్యాంకులో కూడా అన్ని రకాల రుణాలు, ఖాతాలకు సంబంధించిన సేవలు కొనసాగుతాయి. హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విలీనం తర్వాత హెచ్డీఎఫ్సీ కనిపించదు. ఈ విలీనం జూలై 1 నుండి అమలులోకి రానుంది. జూన్ 30న హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బోర్డులు రెండు వేర్వేరు సమావేశాలు జరుపుతాయని.. సమావేశం అనంతరం విలీనం అమలులోకి వస్తుందని హెచ్డీఎఫ్సీ ఛైర్మన్ దీపక్ పరేఖ్ తెలిపారు.
హెచ్డీఎఫ్సీ షేర్లు కూడా స్టాక్ మార్కెట్ నుండి డీలిస్టింగ్ కానున్నాయి. జూలై 13 తర్వాత హెచ్డీఎఫ్సీ షేర్లు అన్నీ భవిష్యత్తులో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లుగా ట్రేడ్ కానున్నాయి. విలీనం తర్వాత హెచ్డీఎఫ్సీ,హెచ్డీఎఫ్సీ బ్యాంకులో 41% వాటా పొందనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2022 ఏప్రిల్ 4న విలీనాన్ని ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లోని కొన్ని బ్రాంచ్‌ల్లో హౌసింగ్ లోన్ అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా తీసుకున్నారు. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనం కింద పెట్టుబడిదారులకు హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన 25 షేర్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 42 షేర్లు కేటాయించనున్నారు. ఈ విలీనం అనంతరం మార్కెట్ క్యాప్‌లో రిలయన్స్ తర్వాత దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరించనుంది.