ప్రస్తుతం ప్రతి ఒక్కరి బ్యాంకుకు సంబంధించిన పనులు ఉంటున్నాయి. అందుకే చాలా మంది నిత్యం బ్యాంకులకు వెళ్తుంటారు. అలానే బ్యాంకులు కూడా తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆసక్తికర నిర్ణయాలు తీసుకుంటాయి.
నెలకు ఓ 40, 50 వేలు జీతం వచ్చే ఉద్యోగం కావాలంటే ఖచ్చితంగా కోర్సు చేయాలి. కోర్స్ చేస్తే ఉద్యోగం వస్తుందో లేదో పక్కనబెడితే కోర్సు నేర్చుకుంటూ కూడా స్టైపెండ్ పొందే అవకాశం ఎవరైనా ఇస్తారా? ఏడాది కోర్సులో 6 నెలల పాటు పాతిక వేల స్టైపెండ్ ఎవరిస్తారు. ఈ అవకాశం హెచ్డీఎఫ్సీ ఫ్యూచర్ బ్యాంకర్స్ ప్రోగ్రాం కల్పిస్తోంది.
బంగారంపై రుణం తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ ఇస్తుందో తెలుసుకోండి.
బ్యాంకుల్లో డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం అనేది ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తుంటారు. రిటైర్మెంట్ సమయంలోనో, లేదంటే పిల్లల పెళ్లిళ్ల కోసమనో, చదువుకోసమనో కొన్నాళ్ల పాటు డిపాజిట్ చేస్తారు. అది కొన్నాళ్ల తర్వాత డబ్బుకు డబ్బు అవుతుంది. అయితే అది బ్యాంకులు దివాళా తీయనంత వరకూ బానే ఉంటుంది. దివాళా తీస్తే ఏంటి పరిస్థితి? అందుకే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసే ముందు ఆ బ్యాంకులు సురక్షితమో కాదో తెలుసుకోండి.
'సార్.. మీకు క్రెడిట్ ఉందా..?' అని ప్రశ్న ఎదురవ్వగానే.. లేదని చెప్పి క్రెడిట్ కార్డు తీసేసుకుంటున్నారా..? అయితే ఇది చదివాక అలాంటి నిర్ణయం తీసుకోండి. లేదంటే భారీగా నష్టపోవాల్సి ఉంటుంది.
బ్యాంక్ ఖాతాదారుల వివరాలు హ్యాకర్ల చేతికి చేరినట్లు వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం ఈ వార్త బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేస్తోంది. ఓ హ్యాకర్.. వినియోగదారులు వ్యక్తిగత వివరాలకు సంబంధించిన డేటాను డార్క్‌వెబ్‌లో పోస్టు చేయడంతోపాటు దానిని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేలా చేశాడు. లీకైన డేటాలో వినియోగదారులు వ్యక్తిగత వివరాలతో పాటు రుణ సమాచారం, లావాదేవీల పద్ధతులు, క్రెడిట్ స్కోర్లు సహా పలు ఇతర వివరాలు ఉన్నట్టు తెలుస్తోంది.
ఎంత టెక్నాలజీ పెరిగినా.. ఎన్ని కొత్త పద్ధతులు వచ్చినా కూడా ఇప్పటికీ అంతా బ్యాంకులనే ప్రధాన లావాదేవీల కేంద్రాలుగా భావిస్తున్నారు. చాలా మంది ఏదో పనిమీద ఇప్పటికీ తరచూ బ్యాంకులకు వెళ్తుంటారు. అయితే బ్యాంకులు మనకు ఏ సేవలను కూడా ఉచితంగా ఇవ్వదని తెలిసిందే. వాళ్లు ప్రతి సేవకు ఛార్జీలు వసూలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు క్యాష్ లెస్ ట్రాన్సక్షన్స్ చాలా బాగా పెరిగిపోయాయి. కానీ, ఇప్పటికీ చాలామంది లిక్విడ్ క్యాష్ కోసం ఏటీఎంలలో విత్‌డ్రాలు చేస్తూనే […]
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. వరుసగా మూడో నెలలో కూడా మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్‌ఆర్)ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అది కూడా నేటి నుంచే(ఆగస్టు 8) అమలులోకి రానున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయంతో గృహ, వ్యక్తిగత, ఆటో, ఇతర లోన్లపై వడ్డీ రేటు పెరగనుంది. దీని ద్వారా కస్టమర్లు చెల్లించే నెలవారీ వాయిదాలు కూడా పెరగనున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రుణాలపై అన్ని టెన్యూర్లకు సంబంధించి ఎంసీఎల్‌ఆర్‌ను 10 బేసిస్ పాయింట్లు […]
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2022-23 విద్యా సంవత్సరానికిగాను అర్హులైన విద్యార్థుల నుంచి కింది స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులు కోరుతోంది. ఈ స్కాలర్షిప్ పథకం ద్వారా సమాజంలోని అణగారిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత అందిస్తోంది. ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 1వ తరగతి మొదలు డిగ్రీ, పీజీ చదువులను అభ్యసించే విద్యార్థుల కోసం ఉద్దేశించింది. చదుతున్న తరగతులను బట్టి స్కాలర్షిప్ ఉంటుంది. కనిష్టంగా 1వ తరగతి చదువుతున్న వారికి రూ. 15,000 ఉండగా గరిష్ఠంగా పీజీ […]
Vikarabad: వికారాబాద్‌లో ఓ వ్యాపారి హెచ్డీఎఫ్సీ అకౌంట్లో భారీగా నగదు జమకావటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వికారాబాద్‌కు చెందిన వెంకట్ రెడ్డి ఖాతాలోకి ఆదివారం ఉన్నట్టుండి ఏకంగా రూ.18 కోట్లు వచ్చి పడ్డాయి. దీంతో సదరు వెంకట్ రెడ్డి షాక్ తిన్నాడు. తన అకౌంట్లో అంత పెద్ద మొత్తం డబ్బులు ఉండటం ఏంటని అనుకున్నాడు. వెంటనే బ్యాంక్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. తన అకౌంట్లో రూ.18 కోట్ల డబ్బు ఉన్నట్లు చూపిస్తోందని చెప్పాడు. దీంతో హెచ్డీఎఫ్సీ […]