ప్రస్తుతం ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరూ ఆన్ లైన్ లోనే షాపింగ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి శ్రమ లేకుండా వస్తువులు ఇంటికి వచ్చేస్తాయి. అయితే ఈ సేవలకు ఛార్జెస్ ఉంటాయి. వాటి వల్ల ఉపాధి కూడా లభిస్తుంది. దుకాణానికి వెల్లకుండానే మీకు కావాల్సిన వస్తువులను ఇ-కామర్స్ సైట్లలో ఆర్డర్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం అంతా ఆన్ లైన్ ఆర్డర్స్, ఆన్ లైన్ సర్వీసెస్ అయిపోయాయి. ప్రజలు కూడా బయట దుకాణానికి వెళ్లి కొనుగోలు చేయడం కంటే యాప్స్, ఇ-కామర్స్ సైట్లలోనే ఆర్డర్స్ పెడుతున్నారు. అందుకే చాలా ఇ-కామర్స్ సైట్లు పుట్టుకొచ్చాయి. ఫుడ్ డెలివరీ కోసం కొన్ని కంపెనీలు, దుస్తుల కోసం, గృహోపకరణాలు ఒకటి కాదు ఇలా చాలా వస్తువల కోసం సర్వీసెస్, యాప్స్, కంపెనీలు ఉన్నాయి. వాళ్లు ఒక వస్తువుని అమ్మకందారు నుంచి కొనుగోలుదారుడికి చేరవేస్తారు. అందుకు కొంత ఛార్జ్ చేస్తారు. అలాంటి వాటిలో స్విగ్గీ- జొమాటో చాలా మందికి తెలుసు. ఇప్పుడు చెప్పుకోబోయే సర్వీస్ అయితే వాటికన్నా తక్కువ ధరకే ఫుడ్ డెలివరీ చేస్తుంది.
అన్ని ప్రధాన నగరాల్లో స్విగ్గీ– జొమాటో సర్వీసెస్ ఉన్నాయి. భారతదేశంలో ఈ సర్వీస్ పై ఆధారపడి ఎంతో ఉపాధి కూడా పొందుతున్నారు. చాలా రెస్టారెంట్లు, హోటల్స్ కు వ్యాపారం అభివృద్ధి జరుగుతోంది. అలాగే దుస్తుల కోసం, చెప్పులు, ఎలక్ట్రానిక్స్ ఇలా అన్నింటికి కొన్ని యాప్స్, వెబ్ సైట్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ రంగంలోకి ప్రభుత్వానికి సంబధించిన సర్వీస్ ఒకటి ఎంటర్ అయింది. అదే ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ONDC) సర్వీస్. అమ్మకందారులు, కొనుగోలు దారులను ఒకచోట కలిపేదే ఈ ప్లాట్ ఫామ్. మీకు ఏదైనా వ్యాపారం, సర్వీస్ ఉంటే మీరు ఇందులో రిజస్టర్ అవ్వచ్చు. మీకు ఏదైనా ప్రొడక్ట్, ఫుడ్ కావాలంటే ఇందులో ఆర్డర్ చేసుకోవచ్చు.
🔹Price comparison between #ONDC and #Swiggy \ #Zomato — key metrics, location and time being the same — revealed that Swiggy, even after discounts, was 95% more expensive on the pocket compared to ONDC. pic.twitter.com/xmTK05h3a7
— Inc42 (@Inc42) May 6, 2023
అయితే ఇక్కడే ఎందుకు కొనుగోలు చేయాలి అని అడగచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సర్వీసెస్ కంటే కూడా ఓన్ డీసీలో తక్కువ ధరకు ఉత్పత్తులు లభిస్తున్నాయి. అంతేకాకుండా ఎక్స్ క్లూజివ్ డిస్కౌంట్స్, కూపన్ కోడ్స్ కూడా ఉన్నాయి. వాటి ద్వారా మీకు రెగ్యూలర్ ఇ-కామర్స్ సైట్ల కంటే కూడా.. ఓఎన్ డీసీలో తక్కువ ధరకే ఉత్పత్తులు లభిస్తాయి. ఇప్పటికే ఇది 236 నగరాల్లో ఎక్స్ పెరిమెంటల్ లో స్టేజ్ లో ఉంది. బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో ఓన్ డీసీ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడలో ఎక్స్ పెరిమెంటల్ స్టేజ్ లో ఉంది. అయితే హైదరాబాద్ లో ఈ సర్వీస్ ని వాడుకునే వీలుంది. మీరు పేటీఎం ద్వారా ఈ ఓన్ డీసీ సర్వీస్ ని పొందవచ్చు.
Today I tried the most hype online market place ONDC STORE available at @mystoreforindia website & I my experience is good. I got Extra Rs 50 Off along with free and fast shipping. This @ONDC_Official Store is really setting a trend in online shopping 👌 #VocalForLocal #ONDC pic.twitter.com/mjtDuEmb9j
— Zafar Saifi (@ZafarSaifii) May 12, 2023
బెంగళూరులో ఈ సర్వీస్ కి మంచి స్పందన వస్తోంది. నెటిజన్స్ సోషల్ మీడియా యాప్స్ ద్వారా తాము ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్స్, వాటికి లభించిన డిస్కౌంట్స్ గురించి స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు. అంతేకాకుండా ఓఎన్ డీసీ సర్వీస్ గురించి తెగ పొగిడేస్తున్నారు. ఓన్ ఎడీసీ ద్వారా ఎంతో మందికి ఉపాధి కూడా లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇంకా పూర్తి స్థాయిలో ఈ సర్వీస్ అందుబాటులోకి రాలేదు. సాధ్మైనంత త్వరగా ఓన్ డీసీ సేవలను అన్ని నగరాలకు విస్తరిస్తామని చెబుతున్నారు. బెంగళూరు, ఢిల్లీ తర్వాత మిగిలిన నగరాల్లో ఫుల్ ఫెడ్జ్ గా సర్వీస్ స్టార్ట్ చేస్తే చాలా ఇ-కామర్స్ సైట్లతో పోలిస్తే అతి తక్కువ ధరలకే ఉత్పత్తులు లభిస్తాయని చెబుతున్నారు. కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ఓఎన్ డీసీ సర్వీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Price comparison between Swiggy, Zomato and ONDC in Vizag.
This is insane! #ONDC pic.twitter.com/N3Jy02Cekm
— Vinay Maharshi (@Vinay_218) May 8, 2023