ఆడ,మగ ముద్దు పెట్టుకోవటం అన్నది ఈ నాటిది కాదు. ముద్దుకు 4500 ఏళ్ల చరిత్ర ఉందని తాజాగా శాస్త్రవేత్తలు తేల్చారు. ఓ మట్టి పలకలాంటి వస్తువు ఒకటి దొరికింది. ఆ మట్టి పలకలో...
ప్రేమను తెలియజేసే పద్దతుల్లో ముద్దు పెట్టుకోవటం కూడా ఒకటి. ఎదుటి వ్యక్తి మీద మనకున్న ఫీలింగ్‌ను బట్టి వారి శరీరంపై ముద్దు పెట్టే చోటు మారుతుంది. నుదురు మీద ముద్దు పెట్టుకోవటం ఒకలాంటి భావాన్ని తెలియజేస్తే.. పెదాలపై ముద్దు పెట్టుకోవటం ఒకలాంటి భావాన్ని తెలియజేస్తుంది. చరిత్రలో ముద్దుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కవులు, కళాకారులు ముద్దును ఎన్నో రకాలుగా అభివర్ణించారు. ఇక, ముద్దు పెట్టుకునే సంప్రదాయం ఇప్పటిది కాదు.. ముద్దుకు చాలా ఏళ్ల చరిత్ర ఉంది. చరిత్రలో తొలిసారి 3500 ఏళ్ల క్రితం ముద్దు పెట్టుకున్నట్లు శాస్త్రవేత్తలు నిన్నటి వరకు భావించారు.
అయితే, అది తప్పని తేలింది. అంతకు 1000 సంవత్సరాలకు పూర్వమే ఆడ,మగ ముద్దు పెట్టుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి. 4500 సంవత్సరాలకు పూర్వమే మెసపటోమియాలో తొలి ముద్దు నమోదైంది. ఇందుకు సంబంధించిన విషయాలను జర్నల్ సైన్స్ తాజాగా విడుదల చేసింది. ఆ జర్నల్‌లో మెసపటోమియాకు చెందిన ఓ మట్టి పలకలాంటి వస్తువు ఒకటి దొరికింది. ఆ మట్టి పలకలో శృంగారం చేసుకుంటున్న ఆడ, మగ బొమ్మలు ఉన్నాయి. ఆ ఆడ,మగ ముద్దు పెట్టుకుంటూ ఉన్నారు.
ఈ మట్టి పాత్ర దాదాపు 4500 సంవత్సరాలకు పూర్వానిదని శాస్త్రవ్తేలు తేల్చారు. చాలా శతాద్ధాలుగా ముద్దు అనేది సంస్కృతిలో భాగంగా ఉంటూ వస్తోందని, అది ఏ మతంనుంచి వేరే చోటుకు పాకలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముద్దు ద్వారా మంచితో పాటు చెడు కూడా జరుగుతుందని అన్నారు. ముద్దు ద్వారా కొన్ని రకాల బ్యాక్టీరియా, వైరస్‌లు ఒకరినుంచి ఒకరికి పాకుతాయని చెబుతున్నారు. మరి, చరిత్రలో మొదటి సారి రికార్డయిన తొలి ముద్దుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.