ఒక విచిత్రం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన భరత్ – జల్సా, గగనం, అత్తారింటికి దారేది, రాజా ది గ్రేట్, డిస్కో రాజా లాంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఈ నటుడు మిల్లెట్ మార్వెల్స్ అనే రెస్టారెంట్ ను హైదరాబాద్ జుబ్లీ హిల్స్ లో ప్రారంభించారు. టేస్టిఫుల్లీ క్రాఫ్టెడ్ సూపర్ ఫుడ్ అనే క్యాప్షన్ తో ఈ రెస్టారెంట్ ప్రచారం ప్రారభించారు. హెల్దీ ఫుడ్ మన శరీరానికి ఎంతో అవసరం అనీ, దాన్ని రుచికరంగా మేం అందిస్తాం […]
హైదరాబాద్ నగరంలో లాక్‌డౌన్ కారణంగా మధ్యాహ్నం నుంచి రెస్టారెంట్లు, హోటళ్లు బంద్ అవుతుండడంతో చాలా మంది ఫుడ్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుని ఇంటికి తెప్పించుకుని తింటున్నారు. దీంతో రెస్టారెంట్లు ఆన్‌లైన్ ఆర్డర్లపై అదనంగా పన్నులు వేస్తూ వినియోగదారుల నుంచి దోపిడీ చేస్తున్నాయి. కొత్తగా హ్యాండ్లింగ్, ప్యాకేజింగ్ ఛార్జీ, పన్నులు, ప్యాకింగ్ చార్జిలు, డెలివరీ చార్జీల పేరుతో దాదాపు రూ.60 నుంచి రూ.100 అదనంగా వసూలు చేస్తున్నాయి. అంతేకాదు ధరల విషయంలోనూ గోల్ మాల్ చేస్తున్నాయి. రెస్టారెంట్ వద్ద […]
సెల్‌ఫోన్ ప్రస్తుతం అందరినీ కట్టుబానిసలుగా మార్చుతోంది. ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకూ చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరినీ తనపై ఆధారపడేలా మలుచుకుంటోంది. దూర ప్రాంతాల్లో నివసించే బంధువులు, స్నేహితుల క్షేమ సమాచారం, అత్యవసర పనుల కోసం అందుబాటులోకి వచ్చిన సెల్‌ఫోన్లను అవసరం లేని పనులకు వినియోగించుకుంటూ తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. కొందరు డ్యూటీల్లో కూడా ఫోన్లను వాడుతూ ప్రమాదాలకు కానీ, తప్పిదాలకు గాని గురవుతున్నారు. ఈ నేపధ్యంలో విధుల్లో ఉన్నప్పుడు […]
వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిర పరచే కుట్రకు పాల్పడుతున్నారంటూ ఎంపీ రఘురామరాజును రెండు రోజుల క్రితం ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్‌లో ని ఆయన నివాసంలో అరెస్ట్ చేసి గుంటూరు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. రఘురామ రాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులతో బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేసి నివేదికను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామ రాజుకు వైద్య […]
తమిళనాడు సీఎం స్టాలిన్ ఆదేశాలతో తమిళనాడు పోలీసులు కో వ్యాక్సిన్, ఆక్సిజన్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ లో విక్రయించే వారి పనిపట్టడానికి రంగంలోకి దిగారు. ప్రజల ప్రాణాలతో కూడా వ్యాపారం చెయ్యాలని ప్రయత్నిస్తున్న కేటుగాళ్ల భరతం పట్టాలని సీఎం ఎంకే. స్టాలిన్ ఆదేశాలు జారీ చెయ్యడంతో పోలీసులతో పాటు డీఎంకే పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వసూలు చేసిన జరిమానాను పోలీసులు బాధితుడి ఇంటికే వెళ్లి అందజేశారు. మేము ఆక్సిజన్ కూడా బ్లాక్ […]
ఎక్కడో ఉత్తరాంధ్రజిల్లా మారుమూల గ్రామం మాడుగుల. అయితే ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయ్యింది. అదీ ఓ స్వీట్ తయారీ వల్ల. విశాఖ జిల్లా మాడుగుల ప్రాంతం పేరుతోనే మిఠాయి హల్వాకు అంత గుర్తింపొచ్చింది. 1890లో ఒక మిఠాయి వ్యాపారి దీనిని తయారు చేశారు. ఇప్పుడు అమెరికా, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, అస్ట్రేలియా., ఇలా 20 దేశాల ప్రజలకు మాడుగుల హల్వా రుచి తెలుసు. మాడుగుల నుంచి విదేశాలకు వెళ్లిన వాళ్లు ఈ హల్వాను తీసుకెళ్లడంతో విదేశాల్లో సైతం […]
ఏపీలో కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. బుధవారం నుంచి మధ్యాహ్నం 12 తర్వాత కఠినమైన ఆంక్షలు అమలుకానున్నాయి. ఆర్టీసీ బస్సులకు సంబంధించి కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ప్రజా రవాణా వాహనాలు నడపాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు వంటివి మధ్యాహ్నం తర్వాత నడిపేందుకు అవకాశం ఉండదు. బస్సులు తిరిగేందుకు ఆరుగంటలే సమయం. ఇప్పటికే బెంగళూరు, చెన్నైకు బస్సులు నిలిపివేయగా.. తాజాగా హైదరాబాద్‌కు సర్వీసులు […]