తమిళనాడు సీఎం స్టాలిన్ ఆదేశాలతో తమిళనాడు పోలీసులు కో వ్యాక్సిన్, ఆక్సిజన్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ లో విక్రయించే వారి పనిపట్టడానికి రంగంలోకి దిగారు. ప్రజల ప్రాణాలతో కూడా వ్యాపారం చెయ్యాలని ప్రయత్నిస్తున్న కేటుగాళ్ల భరతం పట్టాలని సీఎం ఎంకే. స్టాలిన్ ఆదేశాలు జారీ చెయ్యడంతో పోలీసులతో పాటు డీఎంకే పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వసూలు చేసిన జరిమానాను పోలీసులు బాధితుడి ఇంటికే వెళ్లి అందజేశారు.
మేము ఆక్సిజన్ కూడా బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తామని అంటుంటే చూస్తూ చేతులు కట్టుకుని కుర్చోవడానికి. మీకు వనక్కం అంటూ వదిలేయడానికి అక్కడ ఉండేది ఎవరో కాదు స్టాలిన్, సీఎం మీ చీటి చినిగిపోతుంది జాగ్రత్త!.. అంటూ డీఎంకే కార్యకర్తలు బ్లాక్ మార్కెట్ దందా బ్యాచ్ లకు వార్నింగ్ ఇస్తున్నారు. సీఎం స్టాలిన్ ఆదేశాలతో పోలీసులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. స్టాలిన్ మరోసారి తన దైన శైలితో అక్కడి ప్రజల హృదయాలు గెలుచుకున్నారు.
తమిళనాడులో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోవడంతో ఆ రాష్ట్రంలో సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేశారు. తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ వెంటనే రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చెయ్యాలని, రాష్ట్రానికి లాభం కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం అంటూ సంచలన నిర్ణయం తీసుకుని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తిరువళ్లూర్ జిల్లా సెవ్వాపేట సమీపంలోని సిరుకూడల్ గ్రామానికి చెందిన 48 ఏళ్ల బాలచంద్రన్ కుమారుడు బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నాడు. తన కొడుక్కి మందులు కొనుగోలు చేసేందుకు గత శుక్రవారం తిరువళ్లూర్ వచ్చాడు.
అదే సమయంలో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు హెల్మెట్ లేదంటూ బాలచంద్రన్ కు రూ. 500 జరిమానా విధించారు. తన కుమారుడి మందుల కోసం రూ.1,000 మాత్రమే ఉందని’ బాలచంద్రన్ బతిమిలాడినా పోలీసులు వినిపించుకోక పోవడంతో జరిమానా చెల్లించి, మాత్రలు తీసుకోకుండా వెనుదిరిగాడు. ఈ విషయాన్ని బాలచంద్రన్ ముఖ్యమంత్రి స్టాలిన్ ట్విట్టర్‌లో పేరొన్నాడు.
సీఎం ఆదేశాలతో సచివాలయ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని విచారించారు. ఈ నేపథ్యంలో, శనివారం తిరువళ్లూర్ తాలూకా సీఐ రజనీకాంత్, బాలచంద్రన్ ఇంటికి వెళ్లి, జరిమానా కింద వసూలుచేసిన రూ.500 చెల్లించి క్షమాపణ కోరాడు. మరోవైపు, తన విన్నపం పట్ల తక్షణమే స్పందించిన స్టాలిన్ కు బాలచంద్రన్ కృతజ్ఞతలు తెలిపారు.