పదో తరగతిలోనే అతనితో లెచిపోయా, కానీ ఓ రోజు రాత్రి.. ఏడ్చేసిన బిగ్ బాస్ సిరి

బిగ్ బాస్ స్పెషల్- బిగ్ బాస్ 5 తెలుగు రియాల్టీ షో ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ అందరు గేమ్ బాగా ఆడుతుండటంతో షో రతసవత్తరంగా మారింది. ఒక్కో సందర్బంలో ఒక్కక్క కంటెస్టెంట్ వారి వారి జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్పుకుంటున్నారు. ఇదిగో ఈ క్రమంలోనే సిరి హనుమంత్ తన జీవితంలోని ఘటనను గుర్తు చేసుకుని బాగా ఎమోషనల్ అయ్యింది.

గురవారం నాటి బిగ్ బాస్ ఎపిసోడ్‌లో హౌజ్ సభ్యులు వారి వారి తొలి ప్రేమల్ని గుర్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా తన పదో తరగతి లవ్ స్టోరీ గురించి చెప్పుకుని ఏడ్సేసింది సిరి. ఆమె ఏంచెప్పిందంటే.. అతని పేరు విష్ణు.. అందరూ ముద్దుగా చిన్నా అంటారు.. నేను కూడా అదే అంటాను.. నా ఫస్ట్ లవ్ ఇతనే.. అప్పటికి నేను పదో తరగతి చదువుతున్నా.. మేం ఎదురెదురు ఇళ్లలో ఉండేవాళ్లం.. ఓరోజు తన నాకు ప్రపోజ్ చేశాడు.. తనంటే నాకూ ఇష్టమే కావడంతో ఎప్పుడెప్పుడు చెప్తాడా అని నేనూ వెయిట్ చేసి.. చివరికి ఓకే చెప్పేశా.. అని చెప్పింది సిరి.

Bigg boss Siri 1

తను చాలా పొసిసివ్.. ఎలాగంటే నేను కనీసం కాలేజ్ ఫ్రెండ్స్‌తో మాట్లాడినా తీసుకోలేకపోయేవాడు. ఇదే విషయంపై ఒకరోజు మా మధ్య పెద్ద గొడవ అయ్యింది.. అదే టైంలో నాకు పెళ్లి సంబంధం వచ్చింది.. అతని మీద కోపంతో నేను ఒప్పేసుకున్నాను.. అయితే రేపు ఎంగేజ్‌మెంట్ అనగా తను నా దగ్గరకు వచ్చాడు.. ఒక్కటే ఏడుస్తూ.. నా కాళ్లపై పడిపోయి నాకు నువ్ నాకు కావాలి.. నువ్ లేకుండా ఉండలేను.. నేను తప్పు చేశా.. అని నన్ను కన్వెన్స్ చేశాడు.. అని చెప్పుకొచ్చింది సిరి.

నాకూ తనంటే చాలా ఇష్టం.. తనూ నాకు కావాలని నేను ఏం చేశానంటే.. తెల్లవారితే ఎంగేజ్ మెంట్ అనగా.. నేను రాత్రికి రాత్రి అతనితో జంప్ అయిపోయా.. ఇళ్లు వదిలి అతనితో వెళ్లిపోయాను.. ఆ తరువాత మా అమ్మ నాతో మాట్లాడి, మమ్మల్ని ఒప్పించి వెనక్కి తీసుకుని వచ్చారు.. కానీ మేం రిలేషన్ షిప్‌లోనే ఉన్నాను.. ఆ రిలేషన్ షిప్ చాలా బాగుంది.. కొన్నాళ్లు అలాగే ఉన్నాం.. మధ్యలో గొడవ కూడా అయ్యింది.. ఓరోజు ఉదయాన్ని నాకు 3 గంటలకు మెలుకువ వచ్చేసింది.. నిద్రలేచి మళ్లీ పడుకుని 8 గంటలకు లేచాను.. అని జరిగింది వివరంగా చెప్పింది.

అప్పుడే నాకు షాకింగ్ న్యూస్ తెలిసింది.. విష్ణు చనిపోయాడు అని.. నాకు ఎప్పుడైతే మెలుకువ వచ్చిందో ఉదయం 3 గంటలకు అప్పుడే తను యాక్సిడెంట్‌కి గురై చనిపోయినట్టు తెలిసింది.. తన కోసం నేను ఎంతో చేశా.. కానీ తనని ఆ దేవుడు నాకు ఇవ్వలేదు.. తనని నేను మర్చిపోలేకపోతున్నా.. ఐ లవ్యూ విష్ణు.. అంటూ బోరున ఏడ్చేసింది సిరి. దీంతో హౌజ్ లోని కంటెస్టెంట్స్ అంతా ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. వెక్కి వెక్కి ఏడుస్తున్న సిరిని అంతా ఓదార్చారు.