మోడల్, బిగ్ బాస్ కంటెస్టెంట్, బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్ అంటే తెలియని వారు ఉండరు. కాదేది డ్రస్సుకు అనర్హం అంటూ ఆమె వేసుకునే పిచ్చి డ్రెస్సులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.
బాలీవుడ్ లో వస్తున్న బిగ్ బాస్ షోలో పాల్గొన్న చాలా మంది కంటెస్టెంట్స్ తర్వాత వెండితెరపై తమ సత్తా చాటారు. బిగ్ బాస్ తో బాగా పాపులర్ అయిన కంటెస్టెంట్స్ లో ఒకరు ఉర్ఫీ జావెద్. సోషల్ మీడియా టచ్ ఉన్నవాళ్లకు ఈమె పేరు ప్రత్యేకంగా పరిచయం అక్కలేదు. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ ఉర్ఫీ జావెద్ అంటారు. ఆమె వేసుకునే డ్రెస్సులు ప్రతిసారి కాంట్రవర్సీ అవుతుంటాయి. అర్థనగ్నంగా కనిపించేలా ష్యాషన్ డ్రెస్సులతో వీధుల్లోకి వచ్చేస్తూ కుర్రాళ్ల మతులు పొగొడుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ విమర్శలు వెల్లువెత్తుతాయి. దీనికి సమాధానంగా స్టార్ హీరోయిన్లు వేస్తే తప్ప ఉండదు.. నేను వేస్తే తప్పేంటీ అంటూ విమర్శలను కొట్టిపడేస్తుంది. అలాంటిది తనకు అరోగ్య సమస్య ఉందని ఉర్ఫీ జావేద్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి మోడల్, బాలీవుడ్ నటి, బిగ్బాస్ కంటెస్టెంట్ ఉర్ఫీ జావెద్ అంటే అందరికీ సుపరిచితమే. ప్రతిరోజూ వెరైటీ కాస్ట్యూమ్స్, పిచ్చి డిజైన్లు వేర్ డ్రెస్సులతో జనం మధ్యలోకి వచ్చి ఫోటోలకు ఫోజులు ఇస్తుంది. అవి కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. దీంతో ఉర్పీ వేసుకున్న డ్రెస్సులపై నెటిజన్లు ట్రోల్ చేస్తుంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎదో ఒక ఇబ్బంది ఉంటుంది.. కుర్రాళ్లను గిలిగింతలు పెట్టే ఉర్ఫీ జావెద్ ఓ సర్జరీ వల్ల తన ముఖం అందవిహీనంగా ఎలా మారిపోయిందో అన్న విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది. సర్జరీ వికటించడంతో తన పరిస్థితి గుర్తుపట్టరాకుండా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది.
ఉర్పీ జావెద్.. ‘ప్రస్తుతం ఇండస్ట్రీలో కాంపిటీషన్ కాలం నడుస్తుంది.. ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని భావిస్తుంటారు. నా 18 ఏళ్ల వయసులో లిప్ ఫిల్లర్ సర్జరీ చేయించుకున్నా.. ఆ సమయంలో నా వద్ద ఎక్కువగా డబ్బులు ఉండేవి కావు. నా పెదలు సన్నగా పీలగా ఉండేవి.. దాంతో ఎలాగైనా సరే లావుగా కనబడాలనే ఉద్దేశంతో ఓ డాక్టర్ ని సంప్రదించాను. ఆయన తక్కువ ఖర్చుతో ఆపరేషన్ చేస్తానని అన్నారు. కానీ నేను ఒకటి అనుకుంటే అయ్యింది మరొకటి. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలా తయారు అయిపోయింది. కొంకాలానికి వీటిని ఆపేయాల్సి వచ్చింది.. కానీ అది చాలా డేంజర్, లేనిపోని పరిణామాలకు దారి తీస్తుంది. మీరు ఆపరేషన్ చేయించుకోవద్దు అని చెప్పడంలేదు.. కానీ ఫిల్లర్స్, బొటాక్స్ వాడే సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాని అంటున్నాను’అని చెప్పుకొచ్చింది.
‘అందం గురించి ఆపరేషన్ చేయించుకొని అది కాస్త వికటిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అందం సంగతి దేవుడు ఎరుగు.. ముఖం మొత్తం పాడైపోతుంది. మీరు ఎవరైనా డాక్టర్ దగ్గరకు వెళ్లేముందు అన్నింటి గురించి తెలుసుకొని వెళ్లాలి. ఎవరి ఉచిత సలహాలు పాటించకండి. మీ ముఖం బాగాలేదని, మీ శరీరాకృతి చక్కగా లేదని విమర్శించేవారి గురించి అస్సలు పట్టించుకోకండి.. దాని బదులు ఫిల్లర్స్, సర్జరీ ఎంచుకోవడమే మంచిది. కాకపోతే అలాంటివి మంచి డాక్టర్లతో మాత్రమే ట్రీట్ మెంట్ తీసుకోవాలి’ అంటూ తన ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.