తెలుగు బుల్లితెరపై కార్గీక దీపం ఎంత ఫేమస్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో నటించిన కీర్తి భట్ తర్వాత బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటింది. అంతేకాదు 2వ రన్నరప్ గా నిలిచింది.
తెలుగు బుల్లితెరపై వచ్చిన కార్తీక దీపం, బిగ్ బాస్ తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చెసుకున్న బుల్లితెర నటి కీర్తి భట్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి అందరి మనసు దోచింది. రోడ్డు ప్రమాదంలో తన కుటుంబాన్ని మొత్తం పోగొట్టుకున్నపటికీ ధైర్యం, పట్టుదలతో ఇండస్ట్రీల రాణిస్తూ అందరి మన్ననలు అందుకుంది. తాజాగా కీర్తి భట్ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరల్లోకి వెళితే..
కీర్తి భట్ 2017 లో ఐస్ మహాల్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తెలుగు బుల్లితెరపైకి ‘మనసిచ్చి చూడు’ సీరియల్ లో భానుగా ఎంట్రీ ఇచ్చింది కీర్తి. ఆ తర్వాత కార్తీకదీపం సీరియల్ లో పెద్దైన హిమ పాత్రలో నటించింది. కన్నడ అమ్మాయిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈ సీరియల్స్ తో అచ్చమైన తెలుగు అమ్మాయిగా బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగు లో వచ్చిన రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 6 లో ఇంటి సభ్యులతో అన్నింటా గట్టి పోటీ ఇస్తూ 2వ రన్నరప్ గా నిలిచింది. అప్పటివరకూ కొందరికి మాత్రమే కీర్తికి బిగ్ బాస్ పుణ్యమా అని తెలుగు ప్రేక్షకులందరికీ బాగా తగ్గరయ్యింది. కీర్తి భట్ త్వరలో పెళ్లికి సిద్దమైంది. తన సహ నటుడు కార్తీక్ ని ప్రేమించి పెళ్లి చేసుకోబోతుంది.
మధురానగరిలో బుల్లితెర నటి కీర్తి భట్ వివాహ నిశ్చితార్ధం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బుల్లితెర నటీనటులు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య తనకు కాబోయే భర్త కార్తీక్ ని స్టార్ మా ఛానల్ లో ‘ మా బోనాల జాతర’ స్పెషట్ ఈవెంట్ లో పరిచయం చేసింది కీర్గి భట్. అదే వేదికపై ఇద్దరూ రింగులు కూడా మార్చుకున్నారు. అయితే అది స్కిట్ కాదని.. నిజంగానే కీర్తి భట్, కార్తీక్ తో ఎంగేజ్ మెంట్ జరుపుకుంది. కీర్తి గురించి అన్నీ తెలిసి ఆమెన మనస్పూర్తి ప్రేమించి.. తన కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ పెళ్లికి సిద్ధమయ్యాడు కార్తీక్. ఇలాంటి గొప్ప భర్త, అత్తమామలు దొరకడం తన అదృష్టం అని ఆనందం వ్యక్తం చేస్తుంది కీర్తి భట్.