మహేష్.. ఈ పేరు అంటే ఓ వైబ్రేషన్.. అంటూ అష్టాచెమ్మ చిత్రంలో కలర్స్ స్వాతి పలికే డైలాగ్ అప్పట్లో మహేష్ ఫ్యాన్స్ కి భలే జోష్ తీసుకువచ్చింది. సాధారణంగా తమ అభిమాన హీరోలు ఏ షర్ట్, పాయింట్ వేసినా, బ్రాండెడ్ వస్తువులు వాడినా క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా “గుంటూరు కారం” వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం కావడంతో ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. హీరోయిన్స్ గా శ్రీలీలా, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కొన్ని కారణాల వల్ల అగిపోయిన విషయం తెలిసిందే. మూవీ మొదలైనప్పటి నుంచి షూటింగ్ పలు కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది.. ముందు హీరోయిన్గా పూజా హెగ్డే ని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమెను తప్పించి వేరే హీరోయిన్ ని తీసుకున్నారు. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ని తప్పించారని వార్తలు వచ్చాయి.. దీంతో సినిమా ఆగిపోయిందని పుకార్లు వచ్చాయి. వాటన్నింటికి చెక్ పెడుతూ.. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మాస్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. తాజాగా మహేష్ బాబుకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
నిన్న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ‘గుంటూరు కారం’ సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్ లో మహేష్ బాబు లుంగీ కట్టి, నోట్లో బీడీ పెట్టి, కళ్లజోడుతో సూపర్ స్టార్ ఊర మాస్ లుక్ తో దర్శనమిచ్చాడు. ఇది చూసిన ఫ్యాన్స్ బీడి త్రీడీలో కనబడుతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఆ పోస్టర్ లో తమన్ పేరు కూడా ఉండడంతో తమన్ లేడనే పుకార్లకి తెరపడింది. అయితే ఈ పోస్టర్ లో మహేష్ వేసుకున్న షర్ట్ గురించి నెట్టింట చర్చ జరుగుతుంది. సాధారణంగా తమ అభిమాన హీరోలు సినిమాల్లో వాడే షూస్, గ్లాసేన్, వాచెస్, షట్స్, వంటిది ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేస్తు ఉంటాయి. వాటిని ఫ్యాన్స్ కూడా ధరించి తెగ సంబరపడిపోతుంటారు.
ఇప్పుడు మహేష్ బాబు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన వేసుకున్న షర్ట్ గురించి ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. మహేష్ బాబు వేసుకున్న షర్ట్ ధర చూసి నెటిజన్లు షాక్ గురవుతున్నారు. ఎందుకంటే ఆ షర్ట్ ధర అక్షరాల రూ.74,509 . ఇంత సింపుల్ గా ఉంది దీనికి అంత రేట్ ఉంటుందా.. అని కొందరు సందేహం వ్యక్తం చేస్తుంటే. ఫ్యాషన్ ఫార్ఫెచ్ ఆర్ 13కు చెందిన బ్లీచ్ వాష్ ప్లాయిడ్ షర్ట్ లో మహేష్ బాబు మాస్ లుక్ తో అదరగొట్టాడు. అయితే మహేష్ బాబు రేంజ్ కి ఆ మాత్రం బ్రాండ్ ఉండాల్సిందే అంటూ అభిమానులు సోషల్ మాద్యమాల్లో కామెంట్స్ పెడుతున్నారు.
ఇదిలా ఉంటే ఓ విషయంలో మహేష్ బాబు ఫ్యాన్స్ తీవ్ర నిరాశాగ ఉన్నారని తెలుస్తుంది. పుట్టిన రోజు సందర్భంగా గుంటూరు కారం నుంచి ట్రైలర్, రిలీజ్ అవుతుందని చాలా ఆశతో ఎదురు చూశారు. కానీ వారికి నిరాశే మిగిలిందని చెప్పాలి. ఒక్క పోస్టర్ మినహ ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు మూవీ మేకర్స్. మరోవైపు రాజమౌళి నుండి కూడా ఎలాంటి అప్ డేట్ రాకపోవడంతో ఫ్యాన్ కొంతవరకు నిరాశ చేందారని చెప్పొచ్చు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరిపి అనుకున్న టైమ్ లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట డైరెక్టర్ త్రివిక్రమ్. ఇక ఈ చిత్రాన్ని జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయనున్నారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
#HBDSuperstarMahesh 🥳💥#GunturKaaram pic.twitter.com/2mf80iWpgQ
— Haarika & Hassine Creations (@haarikahassine) August 8, 2023