కరోనా తర్వాత చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. బతుకు తెరువు దూరం అయ్యి.. కుటుంబాలను పోషించుకునే దారి తెలియక సతమతమవుతున్న ఎందరినో ఆదుకున్నవి డెలివరీ బాయ్ ఉద్యోగాలు. ఇప్పటికి కూడా చాలామంది.. చదువు, కోచింగ్ వంటి వాటికి వెళ్తూ.. పార్ట్ టైమ్‌గా డెలివరీ బాయ్‌గా పని చేస్తూ.. ఖర్చులు వెళ్లదీసుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. ఇక అప్పుడప్పుడు కొందరు డెలివరీ బాయ్‌లా కథనాలు నెట్టింట వైరలవుతుంటాయి. జీవితంలో కష్టాలను దాటుకుని.. ఇబ్బందులను లెక్క చేయక.. కుటుంబ పోషణ కోసం డెలివరీ బాయ్‌లుగా పని చేసే వారు మన చుట్టూ ఎందరో ఉన్నారు. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. చిన్న పిల్లలను ఇంటి దగ్గర ఒంటరిగా వదిలేయడం ఇష్టం లేక.. వారిని తనతో పాటు తీసుకుని.. డెలివరీ బాయ్‌గా విధులు నిర్వహిస్తున్నాడు ఓ వ్యక్తి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
ఈ వీడియోని ఫుడ్ బ్లాగర్ సౌరభ్ పంజ్వాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. ప్రస్తుతం ఇది వైరలువతోంది. ఇలాంటి వ్యక్తిని కలవడం వల్ల నేను ఎంతో స్ఫూర్తి పొందాను. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. దీనిలో సౌరభ్.. తాను ఆర్డర్ చేసిన ఫుడ్ డెలివరీకి రాగా.. దాన్ని తీసుకోవడం కోసం వెళ్తాడు. ఎదురుగా ఉన్న డెలివరీ బాయ్ చేతిలో ఆర్డర్‌తో పాటు కుమార్తెను ఎత్తుకుని ఉన్నాడు.
అతడిని చూసిన సౌరభ్.. ఈ పాప ఎవరని ప్రశ్నిస్తే.. ‘‘నా కుమార్తె సార్.. ఇంటి దగ్గర వదిలేసి రావడం ఇష్టం లేక ఇలా నా వెంట తీసుకువస్తున్నాను. కొడుకు కూడా నా వెంటే వస్తాడు.. డెలివరీ చేయడంలో తను అప్పుడప్పుడు నాకు సాయం చేస్తాడు’’ అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. ఇప్పటి వరకు దీన్ని 10 లక్షల మందికి పైగా చూశారు.
ఈ క్రమంలో వీడియోపై జొమాటో కూడా స్పందించింది. తమ ఉద్యోగులకు అందించే చైల్డ్‌కేర్ ప్రయోజనాలను సదరు డెలివరీ బాయ్‌కు అందించేందుకు గాను.. అతడి వివరాలను కోరింది. ‘మీరు చేసిన ఆర్డర్ వివరాలను ప్రైవేట్ మెసేజ్ ద్వారా తెలపగలరు. దాంతో ఆ డెలివరీ బాయ్‌ని కలిసి అవసరమైన సాయం అందిస్తాం.’ అని కామెంట్ చేసింది సంస్థ. ఈ వీడియో చూసిన నెటిజన్లలో కొందరు.. జీవితం చాలా అందమైనది, కానీ చాలా కష్టం అని.. తండ్రి నిజమైన హీరో అంటూ మరొకరు కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.