స్టార్ యాంకర్లందరూ బుల్లి తెరను వదిలి సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నారు. ఇంట్లోనే ఉంటూ రకరకాల వీడియోలను షూట్ చేసి తమ అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. అలా స్టార్ యాంకర్ వర్షిణి కూడా సోషల్ మీడియా వేదికలను మాక్సిమమ్ వాడేస్తూ నెట్టింట వైరల్ అవుతుంది. రకరకాల ఫోటో షాట్స్ తో కుర్రకారుకు నిద్రను దూరంచేస్తుంది ఈ అందాల యాంకరమ్మ. కొంటె చూపుతో కవ్విస్తున్న ఈ చిన్నది ఫోటోలకు కుర్రాలంతా ఫిదా అవుతున్నారు.
హాట్ హాట్ ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఎంటర్‌టైన్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని అభిమానుల చేత అనేలా చేస్తోంది. అయితే ఇటీవల ఈ బ్యూటీ డ్రింక్స్ పక్కకు జరిపిన రొనాల్డో వీడియోను రిమిక్స్ చేసి నెట్టింట వైరల్ అయ్యారో లేదో అప్పుడే మరో వీడియోతో నెట్టింట రచ్చ చేస్తోంది. యాంకర్ వర్షిణికి బిగ్ బాస్ 5లోకి ఎంట్రీ ఇస్తోందని ప్రస్తుతం ఫిలింనగర్‌లో ఇదే టాక్ వినిపిస్తోంది. స్టార్‌మాలో వచ్చే కామెడీ స్టార్స్ షోకు వర్షిణి యాంకర్‌గా వ్యవహరిస్తోంది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఎప్పుడూ ఏదో ఒక వీడియో పెడుతూనే ఉంటుంది.
యాంకర్ వర్షిణి హుషారుగా డ్యాన్స్ చేసిన వీడియోను పోస్ట్ చేసింది. జీన్స్, టీషర్ట్ వేసుకొని తను చేసిన డ్యాన్స్‌ను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. కొందరు నెటిజన్లు అయితే తను డ్యాన్స్ చేస్తుంటే పొట్ట బయటికి రావడం చూసి ”పొట్ట తగ్గించు ముందు, పొట్ట వస్తుంది నీకు” అంటూ కౌంటర్లు ఇచ్చారు. ఏది ఏమైనా వర్షిణి డ్యాన్స్ మాత్రం అదరగొట్టేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.