సమంత తాజాగా నటించిన చిత్రం శాకుంతలం. ఇటీవలె విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది. దాంతో ఈ మూవీ రిజల్ట్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది సమంత.
సినిమా రంగంలో అతి తక్కువ కాలంలో తెరపై మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్స్ లో సమంత ఒకరు. ఆమె నటనతో అందరి మనసులు గెలుచుకుంది. తన ఆరోగ్య సమస్య కారణంగా సినిమాల ఎంపిక విషయంలో ప్రస్తుతం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇటీవల భారీ అంచనాలతో విడుదలైన ‘శాకుంతలం’ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇందులో సమంత కథానాయికగా నటించినప్పటికీ తన ప్రతిభతో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కాళిదాసు రచించిన అరుదైన ప్రేమ కావ్యం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కిన ఈ దృశ్య కావ్యం తెరపై మెప్పించలేకపోయింది.
ఈ క్రమంలోనే తాజాగా విడుదల అయిన శాకుంతలం సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. దాంతో ఈ సినిమాపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భగవద్గీతలోని శ్లోకాన్ని జోడించి తనదైన శైలిలో రియాక్షన్ ఇచ్చింది సమంత. ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి'(పని చేయడం వరకే నీకు అధికారం ఉంటుంది. దాని ఫలితంతో నీకు సంబంధం లేదు. ప్రతిఫలం ఆశించ ఏ పనీ చేయకు. అలాగని పని చేయడం మానకు) అనే గీతా శ్లోకాన్ని తీసుకుని వివరణ చెప్పుకొచ్చింది సమంత. ఈ వివరణతో సోషల్ మీడియాలో ట్రోల్స్ కు చెక్ పెట్టింది. ప్రస్తుతం సమంత పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
ఇక ఎవరి జీవితంలోనైన ఎత్తు పల్లాలు సహజం అని, వాటిని గురించి ఆలోచిస్తే ముందుకు వెళ్లలేని స్థితి ఏర్పడుతుందని సామ్ అభిప్రాయం వ్యక్త పరిచారు. ప్రస్తుతం సమంత చేతిలో పలు ముఖ్యమైన ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అందులో సిటాడెల్ ఇండియన్ వర్షన్ వెబ్ సిరీస్ అతిపెద్దది. దీంతోపాటు విజయదేవరకొండ కథానాయకుడిగా ‘ఖుషి’ సినిమాలో నటిస్తున్నారు. అయితే తన ఆరోగ్య సమస్యను దృష్టిలో పెట్టుకుని సినిమాల ఎంపిక విషయంలో సమంత చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇక తాాజాగా సమంత చేసిన పోస్ట్ పై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. మీరు అన్నది నిజమే మేడం.. కానీ కథలు ఎంపిక చేసుకునే ముందు కొద్దిగా ఆలోచించాలిగా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.