ఇలియానాకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో తెలీదు కానీ.. ఆమె నడుముకు మాత్రం చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక తాజాగా ఓ వీడియో సాంగ్ లో నటించిన ఈ గోవా బ్యూటీ.. తన అందాలతో కుర్రకారుకు మతిపోగొడుతోంది.
సాధారణంగా నటీ, నటులు ఇండస్ట్రీలోకి రావాలి అంటే.. వచ్చినా నిలదొక్కుకోవాలి అంటే.. నటన ఒక్కటే ఉంటే సరిపోదు. ముఖ్యంగా హీరోయిన్ ల విషయంలో నటన ఒక్కటే ఉంటే రాణించలేరు. దానితో పాటుగా అందాల ఆరబోత కూడా అవసరమే. ఈ పాయింట్ ను పట్టుకున్న కొందరు ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. మరికొందరు అవకాశాలు లేక అక్కడే ఆగిపోతున్నారు. అయితే గోవా బ్యూటీ ఇలియానా మాత్రం కాస్త డిఫరెంట్ గా ఆలోచిస్తోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లినప్పటికీ అవకాశాలు దక్కలేదు ఈ జీరో సైజ్ భామకు. ఈ క్రమంలోనే ఓ వీడియో సాంగ్ లో మెరిసింది ఇలియానా. ఈ పాటలో ఇలియానా హాట్ హాట్ ఎక్స్ ప్రెషన్స్ తో అభిమానులకు కిక్కెక్కించింది. ప్రస్తుతం ఈ పాటతో, తన అందాలతో యూట్యూబ్ ను షేక్ చేస్తోంది ఇలియానా.
ఇలియానా.. దేవదాసుతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ నడుము సుందరి.. ఆ తర్వాత పోకిరి, జల్సా, కిక్ సినిమాలతో టాప్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లింది. తన అందచందాలతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యూటీ.. 2012 తర్వాత టాలీవుడ్ కు దూరమై.. బాలీవుడ్ కు దగ్గరైంది. అయినప్పటికీ ఈ గోవా బ్యూటీకి అనుకున్నన్ని అవకాశాలు, విజయాలు దక్కలేదు. దాంతో తన పంథా మార్చాలని భావించినట్లుంది ఈ భామ. తాజాగా ఈ అమ్మడు నటించిన లేటెస్ట్ మ్యూజిక్ వీడియో ‘సబ్ గజబ్’ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. స్టార్ ర్యాపర్ బాద్ షా క్రియేట్ చేసిన హిందీ వీడియో సాంగ్ లో ఇలియానా నటించింది.
ఈ సాంగ్ లో కిల్లింగ్ లుక్స్ తో పాటు తన అందాలతో రెచ్చిపోయింది. బిగుతైన ఎద అందాలను చూపిస్తూ.. హాట్ హాట్ స్టెప్పులతో రెచ్చిపోయింది. ఇక ఈ సాంగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సెక్సీ ఎక్స్ ప్రెషన్స్ తో అభిమానులకు సెగలు పుట్టించింది. ఎప్పుడు తన నడుము అందాలు చూపిస్తూ.. రెచ్చిపోయే ఇల్లీ బేబీ.. తాజా వీడియోలో సైతం అలాగే రెచ్చిపోయింది. అయితే ఈ వీడియోలో కాస్త బొద్దుగా కనిపించింది ఇలియానా. ఇక ఈ సాంగ్ చూసిన వారు అమ్మో.. ఇలియానను ఇలా ఎప్పుడు చూడలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సాంగ్ లో మంజిత్ సింగ్, సుఖ్ జిత్ సింగ్ గిల్ కూడా కనిపించి సందడి చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. మరి ఇలియానా ఈ రేంజ్ లో అందాలు ఆరబోయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.