ఇంద్రజ.. ఇప్పుడు బుల్లితెరపై ఎక్కువగా వినిపిస్తున్న పేరు. హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఆమె.. ఇప్పుడు వరుస షోలతో బిజీ అయ్యింది. అయితే.. తాజాగా ఇంద్రజ స్టేజ్ పై కన్నీరు పెట్టుకుంది. అందుకు కారణం ఏమిటంటే?
ఒకప్పుడు స్టార్స్ గా వెలిగిన హీరోయిన్స్ అంతా తరువాత కాలంలో ఫేడ్ అవుట్ అయిపోయేవారు. కానీ.., టెలివిజన్ వచ్చాక ఆ లెక్క మారింది. రోజా, జీవిత, రాధిక, సుమలత, సంగీత, రంభ ఇలా చాలా మంది బుల్లితెరపై తమ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. వీరిలో చాలా వరకు సూపర్ స్టార్డమ్ దక్కించుకున్నారు కూడా. అయితే.. లేట్ గా ఈ లిస్ట్ లో చేరిన సీనియర్ హీరోయిన్ ఇంద్రజ. రోజా.. రాజకీయాల్లో బిజీ కావడంతో ఇంద్రజకి బుల్లితెరపై జబర్దస్త్ ఎంట్రీ దొరికింది. అక్కడ నుండి ఆమె తిరిగి చూసుకుంది లేదు. ఇప్పుడు అన్ని షోలలో ఇంద్రజ కనిపిస్తూనే ఉంది. ఒకప్పుడు హీరోయిన్ గా ఆమె ఎంతటి క్రేజ్ దక్కించుకుందో, ఇప్పుడు అంతకుమించిన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చి పడింది అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే.., ఇంత హ్యాపీగా కెరీర్ సాగిపోతున్నా.. తాజాగా ఇంద్రజ అందరి ముందు కన్నీరు పెట్టుకుంది.
ఇంద్రజ ఏ షోలో భాగం అయినా.. ఆమె ఆ పోగ్రామ్ లో లీనమైపోతారు. తన హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి ఆ షోని హిట్ చేయాలి అనుకుంటారు. ఈ కమిట్మెంట్ కారణంగానే ఇంద్రజ లిస్ట్ లో శ్రీదేవి డ్రామా కంపెనీ షో కూడా యాడ్ అయ్యింది. ఇక.. ఇండిపెండెన్స్ డే సందర్భంగా రాబోయే.. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ ప్రోమో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ పంచ్ లు అదిరిపోయినా.. హైలెట్ అయ్యింది మాత్రం ఇంద్రజ క్లాసికల్ డ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. అయితే.., అద్భుతమైన డ్యాన్స్ తర్వాత ఇంద్రజ బాగా ఎమోషనల్ అయిపోయింది. తనకి అందిన ప్రశంసలు చూసి ఇంద్రజ ఆనందాన్ని తట్టుకోలేక ఏడ్చేసింది. తనని మళ్ళీ ఒక డ్యాన్సర్ గా చూసుకుని ఆమె ఆనందభాష్పాలు కార్చేసింది. ఇన్నాళ్లు ఇది నేను మిస్ అయిపోయానా అంటూ.. గుక్క పెట్టి ఏడ్చేసింది. ఒక కళాకారిణికి ఈ రకమైన భావోద్వేగం ఉండటం సహజం. ఇంద్రజ ఎమోషనల్ అయిన తీరు కూడా అందరినీ కట్టి పడేసింది.
ఇప్పటికే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి చాలా పోగ్రామ్స్ కు ఇంద్రజ గెస్ట్ గా చేస్తున్నారు. ఇక ఎక్కడ ఏ స్పెషల్ ఈవెంట్ జరిగినా.. ఈ మధ్య ఇంద్రజ డ్యాన్స్ షో కామన్ అయిపోయింది. ఇలా.. చాలా గ్యాప్ తర్వాత ఇంద్రజ ఇంత బిజీ అవ్వడంతో ఆమె అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. బుల్లితెరపై వచ్చిన క్రేజ్ తో ఇంద్రజకి సినిమా ఆఫర్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఏదేమైనా నటి.. తన జీవితంలో ఎలాంటి సక్సెస్ అయితే కోరుకుంటుందో.. ఇంద్రజ ప్రస్తుతం అలాంటి ఫేజ్ లోనే ఉన్నారు. మరి లేటు వయసులో కూడా బుల్లితెర మహారాణిలా వెలిగిపోతున్న ఇంద్రజ సక్సెస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.