కుల, మత బేధాల వంటి తారతమ్యాలను కాదూ.. పరాయి దేశస్థులను కూడా పెళ్లి చేసుకుంటున్నారు. ఇది కొంత వరకు సమాజానికి మంచిదే. అయితే కొన్ని పెళ్లిళ్లు చూస్తుంటే నోరు వెళ్లబెట్టడం ఖాయం. తండ్రి వయస్సులో ఉన్న వ్యక్తిని కుమార్తె వయస్సులో ఉండే మహిళ ప్రేమించడం ఒక ఎత్తయితే.. పెళ్లి చేసుకోవడం మరో ఎత్తు. అలాగే..
ఇటీవల జరుగుతున్న పెళ్లిళ్లు ఊహాతీతం. అందులోనూ ప్రేమ పెళ్లిళ్లు. కుల, మత బేధాల వంటి తారతమ్యాలను కాదూ.. పరాయి దేశస్థులను కూడా పెళ్లి చేసుకుంటున్నారు. ఇది కొంత వరకు సమాజానికి మంచిదే. అయితే కొన్ని పెళ్లిళ్లు చూస్తుంటే నోరు వెళ్లబెట్టడం ఖాయం. తండ్రి వయస్సులో ఉన్న వ్యక్తిని కుమార్తె వయస్సులో ఉండే మహిళ ప్రేమించడం ఒక ఎత్తయితే.. పెళ్లి చేసుకోవడం మరో ఎత్తు. అలాగే వయస్సులో తన కన్నా చాలా పెద్దదైన మహిళపై ఇష్టాన్ని పెంచుకుంటున్నారు కుర్రకారు. వారితో ఏడడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒకప్పుడు ఇటువంటి బంధాన్ని తప్పుపట్టేవారు. కానీ నేటి సమాజంలో వివాహాల తీరు భిన్నంగా మారిపోయింది.
ఎవ్వరికైనా చిన్నప్పుడు మీ క్రష్ ఎవ్వర్రా అని అబ్బాయిలనడిగితే.. నూటికి 80 శాతం మంది తమ టీచర్ అనే చెబుతారు. వారితో ఉన్న అనుబంధం కారణంగా ముందుగా వారి పట్ల ఆకర్షితులవుతుంటారు. అయితే ఈ బంధాన్ని.. ప్రేమ, వివాహ బంధంగా మార్చుకోవడాన్ని తప్పుగా పరిగణిస్తారు. కానీ మారిన సమాజపు పోకడలు ఇప్పుడు ఎవ్వరూ, ఎవ్వరినైనా ప్రేమించొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. అదే చేశాడో యువకుడు. తాను ప్రేమించిన టీచర్‌ను వివాహామాడాడు ఓ విద్యార్థి. ఈ ఘటన మలేషియాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారుతోంది. టీచర్ చేసుకుందంటే కచ్చితంగా ఆమె వయస్సు పెద్దదని ఇక్కడ గ్రహించాలి.
వివరాల్లోకి వెళితే మలేషియాకు చెందిన 22 ఏళ్ల మహమ్మద్ డానియల్ అహ్మద్ అలీ 15 ఏళ్ల వయస్సులో జమీలా అనే మహిళ.. అతడికి ఉపాధ్యాయురాలిగా వచ్చింది. ఆ సమయంలో టీచర్ అంటే అమితమైన గౌరవం ఉండేది. మరో క్లాసుకు మారే సరికి జమీలా దూరం అయింది. అయితే అదే స్కూల్ కావడంతో అప్పుడుప్పుడు పలకరించుకునే వారు. మహమ్మద్ పుట్టిన రోజుకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలపడంతో ఆమె గురించి తెలుసుకోవాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆమె మీద ప్రేమను పెంచుకున్నాడు మహమ్మద్. అతనికి 22 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆమె ప్రేమలో మునిగి పోయిన అతడు..ఆమెకు తన మనస్సులోని మాట చెప్పాడు. అప్పటికే ఆమె వయస్సు 48 ఏళ్లు. అప్పటికే పెళ్లై.. భర్తతో విడాకులు తీసుకుంది జమీలా.
2007లో భర్త నుండి విడిపోయిన జమీలా.. పని మీద శ్రద్ధ పెట్టడం మొదలు పెట్టింది. కుర్రతనంతో మహమ్మద్ అలా చేస్తున్నాడని ఆమె.. అతడి ప్రపోజల్‌ను తోసిపుచ్చింది. ఎలా అయినా తన ప్రేమను అంగీకరించేలా చేయాలని భావించిన మహమ్మద్ .. ఆమెతో నిత్యం ఫోన్లో మాట్లాడుతూ, వాట్సప్ మేసేజ్ చేస్తూ ఆమె మనస్సును కరిగించాడు. అలా తన ప్రేమలో ఆమె పడేటట్లు చేశాడు. చివరకు కుటుంబ సభ్యులు కూడా తమ ప్రేమను అంగీకరించడంతో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. తొలుత 2019లో పెళ్లి చేసుకోవాలనుకున్నప్పటికీ.. కరోనా రావడంతో.. 2021లో వీరిద్దరూ ఏకమయ్యారు. ఇప్పుడు మహమ్మద్ వాటర్ ప్లాంట్ లో పని చేస్తున్నాడు. జమీలా టీచర్‌గా పని చేస్తోంది. ప్రేమకు వయో బేధం లేదని నిరూపించిందీ జంట.