సాధారణంగా పెళ్లి వంటి వేడుకల్లో విందు వేళ గొడవలు జరగడం చాలా సహజం. ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి చోటా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా మాంసాహారం వడ్డించే విందులో ఈ గొడవలు ఎక్కువగా జరుగుతాయి. తనకు ముక్కలు రాలేదనో.. ఓన్లీ సూప్ మాత్రం వేశారనో ఇలా ఏదో ఓ దాని మీద గొడవ ప్రారంభిస్తారు కొందరు.
అది కాస్త చిలికి చిలికి గాలి వాన చందంగా పెద్దగా మారి.. ఆఖరికి వేడుక కాస్త రణరంగంగా మారుతుంది. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి కేరళలో చోటు చేసుకుంది. విందులో అప్పడం కోసం ప్రారంభమైన గొడవ కాస్త పెద్దగా మారి యుద్ధభూమిని తలపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
ఈ సంఘటన కేరళలో చోటు చేసుకుంది. అలప్పూజ జిల్లాలోనిముట్టమ్ పట్టణానికి చెందిన యువతితో.. త్రికూనప్పూజకు చెందిన యువకుడికి కొన్ని రోజుల క్రితం వివాహం నిశ్చయమయ్యింది. ఇక రెండు రోజుల క్రితం రెండు కుటుంబాల సభ్యులు, బంధువుల, స్నేహితుల సమక్షంలో ఓ కళ్యాణ మండపంలో వీరి పెళ్లి జరిగింది.
ఇక వివాహతంతు ముగిసిన తర్వాత విందు మొదలైంది. వధువు కుటుంబం విందును ఏర్పాటుచేయగా.. పెళ్లికి వచ్చిన బంధువులు భోజనాలు చేసి వెళ్తున్నారు. ఇంతలో పెళ్లి కుమారుడి స్నేహితుడు ఒకడు తనకు పాపడ్ (అప్పడం) కావాలని అడిగితే వధువు తరపువారు లేదు అన్నారు.
అలా అప్పడం కోసం మొదలైన వివాదం చివరకు పెద్ద గొడవకు దారితీసింది. ఇక అప్పటి వరకు సందడిగా ఉన్న మండపం కాస్త.. ఈ సంఘటనతో రణరంగంగా మారింది. మాట మాట పెరిగి.. ఆఖరికి కొట్టుకునేవరకు వెళ్లింది. ఇక గొడవ పెద్దది కావడంతో కళ్యాణ మండపం యజమాని మురళీధరన్ అక్కడకు చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేశాడు. అప్పటికే ఇరు వర్గాలు సంయమనం కోల్పోయి ఆయనపై కూడా దాడికి పాల్పడ్డాయి.
ఈ ఘటనలో మురళీధరన్ తలకు గాయం కాగా.. ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మురళీధన్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరి ఈ విచిత్ర సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
In the great 100% literate state of Kerala, a fist fight broke out at a wedding after friends of the bridegroom demanded papad during the feast. This triggered a verbal spat and ended up in an ugly brawl. No wonder Mallus belo papad. 😆 pic.twitter.com/HgkEUYMwfy
— Rakesh Krishnan Simha (@ByRakeshSimha) August 29, 2022