పెళ్లంటే పందిళ్లు, సందళ్లు.. తప్పట్లు, తలంబ్రాలూ’మాత్రమే కాదూ అంతకు మించి. గతంలో పెళ్లిళ్లు హంగూ, ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా జరిగిపోయేవి. కానీ జీవితంలో ఒక్కసారే జరిగే అద్భుత ఘట్టమైన వివాహ తంతును ఇప్పుడు పెద్దగా సెలబ్రేట్ చేస్తున్నారు వధు,వరూలు.. వారి కుటుంబ సభ్యులు.
‘పెళ్లంటే పందిళ్లు, సందళ్లు.. తప్పట్లు, తలంబ్రాలూ’మాత్రమే కాదూ అంతకు మించి. గతంలో పెళ్లిళ్లు హంగూ, ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా జరిగిపోయేవి. కానీ జీవితంలో ఒక్కసారే జరిగే అద్భుత ఘట్టమైన వివాహ తంతును ఇప్పుడు పెద్దగా సెలబ్రేట్ చేస్తున్నారు వధు,వరూలు.. వారి కుటుంబ సభ్యులు. ఆకాశమంత పందిరి, భూదేవంత విస్తరికి కాలం చెల్లిపోయాయి. నిశ్చియ తాంబూల దగ్గర నుండి పెళ్లి ముగిసే తతంగం వరకు వెడ్డింగ్ ప్లానర్స్ చేతిలో పెట్టేస్తున్నారు. దీని వల్ల వేలాది మంది తరలివచ్చినా సరిపోయేలా పెళ్లి మండపాలు.. విస్తరిని మించిపోయి వంటకాలు వచ్చి చేరాయి. ఇక పెళ్లి అనగానే బంధువుల హడావుడి మామూలుగా ఉండదు. మా పెళ్లికి రండి అన్న ఒకే ఒక్క పిలుపుతో కుటుంబ కుటుంబం మొత్తం వచ్చేస్తుంటారు. కొందరు తమ స్థోమతకు మించి ఖర్చులు పెడుతున్నారు.
అయితే ఈ విధానానికి స్వస్థి చెప్పాలని భావించిన కాంగ్రెస్ నేత ఒకరు గతంలో బిల్లును పార్లమెంట్ వేదికగా ప్రవేశపెట్టారు. 2020లో జనవరిలో కాంగ్రెస్ ఎంపీ జస్బీర్ సింగ్ గిల్ ఈ ప్రతిపాదన తీసుకువస్తూ.. బిల్ ప్రవేశ పెట్టారు. పెళ్లిల్లో అతిథుల సంఖ్య 100, వంటకాల సంఖ్య పదికి మించరాదని పేర్కొన్నారు. అంతేనా.. వధూవరులను ఆశ్వీరదించి ఇచ్చే కానుకలు, బహుమతులు రూ. 2500 కన్నా ఎక్కువ ఉండకూదని.. గిఫ్టులకు బదులుగా పేదలు, అనాథల కోసం స్వచ్ఛంద సంస్థలకు విరాళాలివ్వాలని ఆ బిల్లులో పేర్కొన్నారు. ఈ బిల్లు ప్రస్తుతం పార్లమెంట్‌లో చర్చకు వచ్చింది. అయితే ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని సమాచారం. ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే.. ఇక పెళ్లిళ్ల తీరు పూర్తిగా మారిపోతుందేమో చూడాలి.