Kerala: కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరిగినపుడు బంధువులంతా ఒక్కచోటుకు చేరతారు. జరిగేది ఓ మంచి కార్యం.. పైగా బంధువులంతా ఒక్కచోటుకు చేరేది చాలా అరుదు. అందుకని దాన్ని కెమెరాలో బంధించి జ్ఞాపకంగా మలుచుకోవటం అందరూ చేసేది. ఇక, బంధువులంతా గ్రూపు ఫొటో దిగి సంతోషపడిపోతారు. అయితే, చావు విషయంలో ఇలాంటివి ఉండవు. అందరూ ఒక్కచోట కలిసినా ఫొటో దిగటం అన్నది బాగోదు. కానీ, కేరళకు చెందిన ఓ కుటుంబం మాత్రం నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్‌గా తయారైంది. చావు ఇంట్లో ఫొటోకు ఫోజిచ్చింది. అది కూడా నగు ముఖంతో. వివరాల్లోకి వెళితే.. కేరళ, పాతానంతిట్టలోని మల్లపల్లికి చెందిన 95 ఏళ్ల మరియమ్మ ఆగస్టు 17న చనిపోయింది. కుటుంబసభ్యులు మరుసటి రోజు అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. మృతదేహం పాడవకుండా ఓ గాజు పెట్టేలో దాన్ని భద్రపరిచారు. ఎక్కడెక్కడో ఉన్న కుటుంబసభ్యులంతా అంత్యక్రియలకు వచ్చారు. మొత్తం 40 మంది కుటుంబసభ్యులు ఒక చోటుకి చేరారు. ఈ నేపథ్యంలో వారికో ఆలోచన వచ్చింది. అందరూ కలిసి శవం చుట్టూ చేరి ఫొటో తీసుకున్నారు. అది కూడా నవ్వులు చిందిస్తూ.. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంట్లో ఓ మనిషి పోయిందన్న బాధ లేకుండా అలా ఫొటో దిగటం ఏంటని మండిపడుతున్నారు. దీనిపై కుటుంబం స్పందించింది. తల్లి జ్ఞాపకాలను పథిల పర్చుకునేందుకే అలా ఫొటో దిగామని చెప్పింది. ఫొటో దిగినందుకు మేము చింతించటం లేదు. కానీ, ఆ ఫొటోలోని నవ్వులు మాత్రం తెచ్చిపెట్టుకున్నవేనని తెలిపింది. ఓ విషాదకర సంఘటనకు సంబంధించిన ఫొటోపై కూడా జనాలు విమర్శలు చేయటం ఏం బాగోలేదని పేర్కొంది. మరి, కుటుంబ పెద్ద శవాన్ని మధ్యలో పెట్టుకుని ఫ్యామిలీ ఫొటోకు ఫోజివ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : వీడియో: వేరేవాళ్ల ఆర్డర్‌ని లాక్కోవడమే కాక.. డెలివరీ బాయ్‌పై దాడి చేసిన యువతి!