విశాల విశ్వంలో ఎన్నో వింతలు.. అద్భుతాలు.. విశేషాలు. ఇందులో మన తెలివితేటలకు అందేవి కొన్నే.. అందని వింతలు కోకొల్లలు. ఈ అనంత విశ్వం గురించి మనకు తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత. ఇక ఆకాశంలో అప్పుడప్పుడు వింత వింత సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ కోవలోకి చెందిన ఓ అద్భుత దృశ్యం ఈ రోజు ఆకాశంలో ఆవిష్కృతం కానుంది. అదే స్ట్రాబెర్రీ మూన్. మంగళవారం సాయంత్రం 5 గంటల తర్వాత ఈ దృశ్యం కనిపించనుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇక ఈ రోజంతా దీని గురించి చర్చ నడుస్తోంది. మీడియా, సోషల్ మీడియాలో దీని గురించి లెక్కకు మిక్కిలి పోస్ట్లు. ఈ క్రమంలో అసలు ఈ స్ట్రాబెర్రి మూన్ అంటే ఏంటి.. ఇలా జరగడానికి గల కారణాలు.. దీని వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి వంటి పూర్తి వివరాలు..
జూన్ 14, మంగళవారం నాటి పౌర్ణమికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ పున్నమిని.. జ్యేష్ట పౌర్ణమి అంటారు. ఇక ప్రపంచవ్యాప్తంగా నేటి పున్నమి చంద్రుడికి ఎన్నో విశేషాలు, ప్రత్యేకతలు ఉన్నాయి. నేటి పూర్ణ చంద్రుడిని ఫుల్ మూన్ అని, స్ట్రాబెర్రీ సూపర్ మూన్ అని, మెడ్, హనీ మూన్, రోజ్ మూన్ ఇలా పలు రకాల పేర్లతో పిలుస్తారు. భారత్లో వ్రత పౌర్ణమి అని కూడా అంటారు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకు పూర్ణ చంద్రుడు దర్శనం ఇవ్వనున్నాడు. భూమికి అత్యంత సమీపంగా చంద్రుడు వచ్చే పౌర్ణమిని ఫుల్ మూన్ అని చెబుతుంటారు.
ఇది కూడా చదవండి: Men: భార్యా బాధితుల వింత పూజలు.. ‘దేవుడా! ఈ భార్యలు 7 సెకన్లు కూడా మాకొద్దు’..
నేటి పౌర్ణమి వేళ భూమి, చంద్రుడికి మధ్య దూరం చాలా తగ్గుతుంది. అంటే నేడు చందమామకి, భూమికి మధ్య దూరం 3,63,000 కిలోమీటర్లు ఉంటుంది. భూమికి ఇంత దగ్గరగా వచ్చినప్పుడు చంద్రుడు మరింత ప్రకాశవంతంగా, పరిమాణంలోనూ పెద్దగా కనిపిస్తాడు. సాధారణ పౌర్ణమి రోజుల్లో కనిపించే పరిమాణంతో పోలిస్తే ఈ రోజు చంద్రుడి ఆకారం మరింత పెద్దగా ఉంటుంది. అలాగే, 10 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాడు. భూమి నుంచి 4,05,000 కిలోమీటర్ల దూరానికి చంద్రుడు వెళ్లినప్పుడు దాన్ని దూరంగా పరిగణిస్తుంటారు.
ఇది కూడా చదవండి: Goat: మేకను పెళ్లి చేసుకున్న వ్యక్తి.. కారణం తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది..
నాసా ప్రకారం ఒక సూపర్మూన్ దాని కక్ష్యలో భూమికి చాలా దగ్గరగా ఉన్నప్పుడు సాధారణ కంటే 17% పెద్దదిగా, 30% ప్రకాశవంతంగా కనిపిస్తుంది. సూపర్మూన్ చాలా అరుదుగా ఏడాదికి మూడు నుంచి నాలుగు సార్లు సంభవిస్తాయి. ఈ ఏడాదిలో వచ్చిన మూడు సూపర్మూన్లలో మొదటిది స్ట్రాబెర్రీ మూన్. అమెరికా ఈశాన్యం, తూర్పు కెనడా అల్గోన్క్విన్ ప్రాంతంలోని స్థానిక గిరిజన తెగలు ఈ కాలంలో స్ట్రాబెర్రీలను పండిస్తుంటారు. అందుకే దీనికి స్ట్రాబెర్రీ సూపర్ మూన్ అనే పేరు వచ్చింది.
ఐరోపాలో దీన్నే హానీమూన్, రోజ్మూన్ అని పిలుస్తారు. అక్కడ జూన్ చివరి నుంచి తేనె సాగు కాలం కావడంతో హనీమూన్ మూన్ అని.. ఈ కాలంలో గులాబీలు ఎక్కువగా పుష్పిస్తుంటాయి కాబట్టి రోజ్మూన్ అంటారు. ఇంకా ఫ్లవర్ మూన్, హాట్ మూన్, ప్లాంటింగ్ మూన్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇక హిందువులకు వ్రత పూర్ణిమ ఇది. ఈరోజున వివాహితలు మర్రి చెట్టుకు ముడుపు కట్టి ఉపవాస దీక్ష చేస్తారు. తద్వారా తమ భర్తలు దీర్ఘాయుష్షు పొందుతారని నమ్మకం. అంతేకాదు, ఏడేడు జన్మలకూ వీళ్లే తమ భర్తలుగా రావాలని కోరుకుంటారు.
ఇది కూడా చదవండి: Dragon Blood Tree: ఇదెక్కడి వింత.. చెట్టు నుంచి రక్తం కారుతోంది.. ఎందుకిలా!
ఇక, బౌద్ధులు ఈ పౌర్ణమిని పోసన్ పోయ అని పిలుస్తారు. మంగళవారం సాయంత్రం 5 గంటల తర్వాత ఆకాశంలో తూర్పు వైపున చూస్తే చంద్రుడి దర్శనం అవుతుంది. రాత్రి మరింత ప్రకాశంగా ఉంటుంది. ఇక జ్యోతిష్యశాస్త్రపరంగా కూడా దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. దీని ప్రకారం ఆకాశంలో స్ట్రాబెర్రీ మూన్ దర్శనం ధనస్సు రాశిలో జరగడం వల్ల ద్వాదశ రాశులపై ప్రభావం పడనుంది. ముఖ్యంగా మూడు రాశుల వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
వృషభ రాశి..
జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి రోజున చంద్రుడు పరిపూర్ణంగా, ప్రకాశవంతంగా కనిపించడంతో ఈ రాశుల వారికి అశుభ ఫలితాలు రానున్నాయి. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాల్లో సంక్షోభం ఎదురుకావొచ్చు. చిన్నపాటి ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులపై ఏ విషయంలోనూ ఆధారపడకూడదు. ఆర్థిక పరమైన మార్పుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో క్లిష్ట పరిస్థితులు ఎదురుకానుందన, మీరు వాటిని నివారించడానికి కొంచెం ఎక్కువ సమయం శ్రద్ధ వహించాలి.
కర్కాటక రాశి..
ఈ రాశి వారు ఈ కాలంలో ఆరోగ్యం, ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఈ కాలంలో మీకు ఆరోగ్య పరంగా అనేక సవాళ్లు ఎదురవ్వొచ్చు. ధనస్సు రాశిలో చంద్రుని ప్రభావాన్ని తేలికగా తీసుకోకూడదు. ఈ కాలంలో ఎవ్వరిపైనా కోపం చూపొద్దు. మితిమీరిన కోపం మీకు ప్రమాదాలను తెచ్చి పెడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించండి. లేదంటే రకరకాల సంక్షోభాలు వచ్చే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి..
ఈ రాశి వారు అభద్రత,ఆందోళన చెందే సమయం ఇది. ఈ కాలంలో మీకు కొన్ని చిన్న చిన్న సంక్షోభాలుంటాయి. అయితే మీరు జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే వాటిని అధిగమించొచ్చు. మరోవైపు ఈ కాలంలో మీరు దుఃఖాన్ని అదుపు చేసుకోలేరు. అలాగే ఆరోగ్యంపైనా ఎక్కువ శ్రద్ధ వహించాలి. లేదంటే మీరు ఆసుపత్రికి చేరాల్సి వస్తుంది. విద్యార్థులు విద్యను నిర్లక్ష్యం చేయకూడదు.
ఈ మిస్టరీని మిస్ కాకుండా తప్పకుండా చూడండి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Strawberry Moon and its good energy.
Shot by yours truly pic.twitter.com/KqVwFUVCcG
— Euinice (@EuiniceSiey) June 14, 2022