అత్యుత్సాహంతో చేయకూడని పని చేసి తగిన మూల్యం చెల్లించుకున్నారు కొంతమంది యువకులు. వీరిని పోలీసులు ఏం చేశారంటే?
అర్ధరాత్రి అయితే చాలు కుర్రాళ్లకు హద్దు పొద్దు లేకుండా పోతుంది. ఫ్రీడమ్ అనే ముసుగులో తమ సరదా కోసం ఇతరులకి ఇబ్బందిగా మారతారు. అల్లరి చిల్లరిగా వీరు చేసే పనులు ప్రశ్నించడానికి కూడా కొంతమందికి ధైర్యం సరిపోదు. ముఖ్యంగా బార్ లు, క్లబ్ లు అంటూ తాగుడికి బానిసలవుతున్నారు. అయితే తాగితే పర్లేదు కానీ తాగిన క్షణం మరోలోకంలోకి వెళ్ళిపోయి వీరేం చేస్తారో వీరికే అర్ధం కాదు. ఇప్పటివరకు ఇలాంటి సంఘటనలు మనం చాలానే చూసే ఉంటాం. కానీ ఈ సారి మాత్రం ఫలితం వేరే విధంగా వచ్చింది. వీరు చేసే చిల్లర పనులకి, చెత్త వాగుడికి పోలీసులు సరైన బుద్ధి చెప్పారు. భారీ జరిమానా విధించి చెరసాలలో ఉంచారు. ఇంతకీ వీరేం చేశారు? పోలీసులకి ఎలా చిక్కారో ఇప్పుడు చూద్దాం.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్ నగరంలో ఎప్పటిలాగే బాగా తాగేసి కారులో ప్రయాణిస్తున్నారు. వీరిలో ఇద్దరు కుర్రాళ్ళు మరింత రెచ్చిపోయి.. కారు టాప్ ఓపెన్ చేసి దానిపై కూర్చొని అతి చేస్తూ కనిపించారు. అయితే అంతటితోనైనా ఆగిపోయారు అనుకుంటే పొరపాటే. సీసాలు తీసి నడిరోడ్డుపై కారు కదులుతుండగానే తాగారు. అక్కడే కూర్చొని ముచ్చట్లు కూడా పెట్టుకున్నారు. అయితే వీరి సరదాలను కారు వెనకాల కూర్చొని ఉన్న ఒక యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. వీరు చేసిన బాగోతం బయట పడడంతో ఘజియాబాద్ పోలీసులు వీరి వివరాలు సేకరించడం మొదలు పెట్టారు. ఆ వీడియోలో కనిపిస్తున్న కారు నంబరు ఆధారంగా ఆ యువకులను గుర్తించారు. అనంతరం ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. ఒక్కొక్కరికీ రూ. 10 వేల చొప్పున భారీగా ఫైన్ వేశారు. ఈ విషయాన్ని ఘజియాబాద్ డీసీపీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మొత్తానికి అత్యుత్సాహంతో వీరు చేసిన పనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
ऑन रोड कार से स्टंट करते हुए वीडियो हुआ वायरल
ये RDC #गाजियाबाद का वो पॉश इलाका
जहां बड़े बड़े साहबों के मकान है ।लोगो में इतना डर है की , लगातार कार्यवाहियां भी बेअसर है ।@ghaziabadpolice
🙏🇮🇳✍️🙏 pic.twitter.com/ndpU92eXpE— Akash Kumar (@Akashkchoudhary) July 29, 2023