అమ్మ తన ప్రేమను ఎన్నో విధాలుగా చూపిస్తుంది. కానీ ఒక తండ్రి మాత్రం తన స్పర్శ తోనే తన ప్రేమను విలపిస్తాడు. కానీ ఇప్పుడున్న సమాజంలో అలాంటివి అన్ని మర్చిపోయి కొడుకులు తన తల్లిదండ్రుల మీద కసాయి లాగా ప్రవర్తిస్తున్నాడు. ఆ కోవకు చెందిన ఘటనే తాజాగా పంజాబ్ లో చోటు చేసుకుంది.
అమ్మ తన ప్రేమను ఎన్నో విధాలుగా చూపిస్తుంది. కానీ ఒక తండ్రి మాత్రం తన స్పర్శ తోనే తన ప్రేమను విలపిస్తాడు.ఈ ప్రపంచంలో ఒక తండ్రికి మొదటి సూపర్ హీరో తన కుమారుడే. కుమారుడికి కూడా ఎప్పటి తన తండ్రె సూపర్ హీరో… బిడ్డ పుట్టినప్పటి నుండి తండ్రి ఎన్నో త్యాగలతో బిడ్డను చదివించి ఒక మంచి భవిష్యత్తును ఇస్తాడు…అదే బిడ్డ ఎదిగి తాను ఒక తండ్రి అయ్యాక తన తండ్రి తనకు సూపర్ హీరోలా అనిపిస్తాడు. నాన్న పడ్డ కష్టాలు కొడుకు కూడా తండ్రి అయ్యాక జీవితంతో విలువైన గురువులు ప్రత్యేక దైవాలల వారి తల్లిదండ్రులు కనిపిస్తారు. కానీ ఇప్పుడున్న సమాజంలో అలాంటివి అన్ని మర్చిపోయి కొడుకులు తన తల్లిదండ్రుల మీద కసాయి లాగా ప్రవర్తిస్తున్నాడు. ఆ కోవకు చెందిన ఘటనే తాజాగా పంజాబ్ లో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పంజాబ్ లోని హోషియార్ పూర్ జిల్లా జలాల్ చక్క గ్రామానికి చెందిన వీర్ సింగ్ తన కుమారుడు అమర్ సింగ్ తో పాటు ఆ గ్రామంలో ఉంటున్నారు. అలా తండ్రి కొడుకుల జీవితం సాఫీగానే సాగుతుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి వాళ్ల ఇంట్లో ఉన్న ఏసీ సరిగ్గా పని చేయడం లేదని కుమారుడు తండ్రి అమర్ సింగ్ తో చెప్పాడు. తండ్రి ఏ మాత్రం తెలియనట్టుగా ఉంటున్నాడు. దీంతో కుమారుడు ఏసీని రిపేర్ చేయించమని తండ్రికి చెప్పాడు. అలా చెప్పగానే తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ మెుదలైంది. ఆ గొడవ కాస్త మరింత పెద్దగా అయి.. ఆ ఘర్షణలో ఉన్న కుమారుడు ఆగ్రహంతో తండ్రిపై తుపాకితో కాల్పులు జరిపాడు. కాల్పులు జరపగా ఆ రెండు బుల్లెట్లు తండ్రి వీర్ సింగ్ రెండు కాళ్లలోకి చొరబడ్డాయి. అయితే దీనిని గమనించిన స్థానికులు వెంటనే భాదితుడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఉన్నా వైద్యులు మెరుగైన వైద్యం కోసం బాధితుడిని అమృత్ సర్ లోని ఆసుపత్రిలోకి తీసుకెళ్లాలని చెప్పగా… అక్కడికి తీసుకెళ్లారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి పోలీసులతో మాట్లాడుతూ.. నా కొడుకు మధ్యం మత్తులో ఉన్నాడు. ఆ కోపంతో లైసెన్స్ కల్గిన తుపాకితో నా పై కాల్పులు జరిపాడు. అయితే ఈ ఘటనలో నా రెండు కాళ్లలోకి తూటాలు దిగాయి. తను మద్యం మత్తులో ఉండడం వలన తప్పు జరిగిపోయింది. నేను వాడికి తండ్రి అయిన కారణంగా అతనిని అరెస్టు చేయించి.. తప్పు చేయాలనుకోవడం లేదు. నా కుమారునిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని.. తండ్రి పోలీసులను వేడుకున్నాడు. ఈ సంఘటనపై పోలీసు అధికారి బల్విందర్ సింగ్ మాట్లాడుతూ మాకు సమాచారం అందగానే మేము ఘటనా స్థలానికి వెళ్లాము. భాదితుడు మాత్రం చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు చేయొద్దు అన్నాడు. ఒకవేళ అతను కుమారునిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.