హైదరాబాద్ లోని నాచారం ప్రాంతంలో ఒక అనూహ్యమైన ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఒక మహిళ చేసిన పని నాచారం పోలీస్ స్టేషన్ దగ్గర వైరల్ గా మారింది. మరి ఆ మహిళ ఇంతలా ఆ వైన్ షాప్ ముందు విరుచుకుపడడానికి కారణమేంటో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా మద్యం షాప్ ముందు మగవారు కనబడతారు. తాగుడుకి బానిసగా మారిన వారు ఇక్కడ రోజు కనిపిస్తారు. ఇదంతా అందరికి తెలిసిన విషయమే. అయితే ఆశ్చర్యకరంగా ఒక మహిళా మద్యం దుకాణం వద్ద కనిపించింది. కనిపించడమే కాదు అక్కడ షాప్ మీద కోపంతో రగిలిపోయింది. అన్నిటిని ధ్వంసం చేస్తూ ఆవేశంతో అందరిని భయపెట్టింది. హైదరాబాద్ లోని నాచారం ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆవిడ చేసిన పని నాచారం పోలీస్ స్టేషన్ దగ్గర వైరల్ గా మారింది. మరి ఆ మహిళ ఇంతలా ఆ వైన్ షాప్ ముందు విరుచుకుపడడానికి కారణమేంటో ఇప్పుడు చూద్దాం.
నాచారం ప్రాంతం వద్ద నాగి అనే వ్యక్తి నివాసముంటున్నాడు. ఇతడికి రోజు మందు తాగడం అలవాటు. దాంతో సోమవారం అర్దరాత్రి మద్యం తాగడానికి వెళ్ళాడు. అయితే అతను ఎక్కువగా మద్యం తీసుకోవడంతో స్పృహ కోల్పోయాడు. దీంతో అతన్ని ఆ వైన్ షాప్ వారు బయట పడుకోబెట్టారు. అయితే కొంత సమయం గడిచిన తర్వాత నాగి ప్రాణాలు కోల్పోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఈ విష్యం తెలుసుకున్న మృతుడి భార్య, ఇతర కుటుంభం సభ్యులు భారీగా చేరుకొని ఆ షాప్ మీదకి దాడికి దిగారు. తన భర్త మృతికి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా వారు వినిపించుకోలేదు. ఆవేశంతో తన భార్య షాప్ లోపలి వెళ్లి మద్యం బాటిళ్లను పగలగోటీ ప్రయత్నం చేసింది. చేతికి అందిన బాటిల్ ని కింద పడేసింది.
వీటికి సంబంధించిన దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో పోలీసులు ఆ ఘటన స్థలానికి చేరుకున్నారు. తన భర్త చావుకి కారణమయ్యారంటూ హైదరాబాద్ లోని నాచారం పోలీస్ పరిధిలో ఆ మహిళా ఆగ్రహం వ్యక్తం చేసింది. మృతుడి భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. నాగి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరిలించారు.
హైదరాబాద్ – నాచారంలోని కనకదుర్గ వైన్స్‌కు వచ్చిన నాగి అనే వ్యక్తి మద్యం తాగిన అనంతరం అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అతడిని వైన్స్ నిర్వాహకులు బయట పడేశారు. అనంతరం అతను మృతిచెందారు. దీంతో ఆగ్రహానికి గురైన భార్య, కుటుంబ సభ్యులు కలిసి వైన్స్ ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం భార్య వైన్స్… pic.twitter.com/5D9OldRTaz
— Telugu Scribe (@TeluguScribe) July 5, 2023