Goat: మనుషులు జంతువుల్ని పెళ్లి చేసుకోవటం అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటుంది. కొన్ని దేశాల్లో స్త్రీ లేదా పురుషుడి జీవితానికి సంబంధించి పెళ్లి దోషాలు ఉంటే.. ఆ దోషాల్ని పోగొట్టడానికి ఇలా జంతువులతో పెళ్లిళ్లు చేస్తుంటారు. ఆ పెళ్లి తర్వాత దోష నివారణ అయిపోయిందని భావించి నిజమైన పెళ్లి చేస్తారు. కానీ, గ్రేసిక్ రీజెన్సీకి చెందిన ఓ వ్యక్తి మాత్రం వింత కారణంతో మేకను పెళ్లి చేసుకున్నాడు. అదేంటంటే... గ్రేసిక్ రీజెన్సీ, బెంజెంగ్ జిల్లా, క్లాంపోక్ గ్రామానికి చెందిన 44 ఏళ్ల సైఫుల్ అలీకి ఓ కోరిక ఉంది. ఎలాగైనా సరే సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనుకున్నాడు. కొన్ని రోజులు బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. మేకను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. జూన్ 5వ తేదీన సాంప్రదాయ బద్ధంగా పెళ్లి జరిగింది. ఈ వేడుకలో పెళ్లి కూతురు శ్రీ రాహాయు బిన్ బెజోను అందంగా ముస్తాబు చేశారు. ఈ పెళ్లి కోసం అలీ 22వేల రుపాయా( 117 రూపాయలు తీసుకున్నాడు). ఈ పెళ్లి తతంగాన్ని వీడియో తీయించాడు. అతడు అనుకున్నట్లుగానే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పెళ్లిపై నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. ఓ జంతువును ఎలా పెళ్లి చేసుకుంటావు? అంటూ అలీపై మండిపడుతున్నారు. పాజిటివ్‌గా కంటే నెగిటివ్‌గానే వీడియో వైరలై ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. దీనిపై అలీ స్పందిస్తూ.. ఆ పెళ్లి కేవలం వీడియో కోసం చేసిందని స్పష్టత ఇచ్చాడు. ప్రజల్ని ఎంటర్టైన్ చేయటానికి మాత్రమేనని చెప్పాడు. అయినా కూడా అతడిపై విమర్శలు తగ్గటం లేదు. ‘‘చెత్త వీడియో.. డబ్బులు అయితే వచ్చాయి కానీ, పబ్లిక్కు పెద్ద సమస్యగా మారింది’’.. ‘‘ ఇందులో ఒక్కర్ని మాత్రమే నిందించి లాభం లేదు. గ్రామ పెద్ద, చుట్టు పక్కల ఉన్న వాళ్లు ఈ పెళ్లికి మద్దతు తెలిపినట్లుగా ఉన్నారు’’.. ‘‘వాళ్లంతా ఆ పెళ్లిని ప్రోత్సహిస్తున్నారు.. అది ఎంత ఘోరం’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : ఆస్పత్రికి వెళ్లి ట్రీట్ మెంట్ చేయించుకున్న తల్లికోతి.. వీడియో వైరల్