ఏ విషయం అయినా లిమిట్‌లో ఉండాలని అందరూ చెబుతుంటారు. ఏ పనైనా అతిగా చేస్తే ఆ ప్రభావం తప్పకుండా తీవ్రంగానే ఉంటుంది. ఆహారం, వర్కౌట్, ప్రాక్టీస్, గేమ్స్ ఇలా ఏవైనా సరే వాటికంటూ ఒక హద్దు అనేది ఉండాలి. అంతేకాకుండా మనం చేసే పనిని ఎలా చేస్తున్నాం? ఎంత ఎఫెక్టివ్‌గా చేస్తున్నా? మన శరీరం అందుకు తట్టుకుంటుందా? ఇలాంటివి కూడా ఆలోచించుకోవాలి.
అలాంటి లెక్కలు ఏమీ లేకుండా ఒక ఉద్యోగి అతిగా పబ్ గోల్ఫ్ డ్రికింగ్ గేమ్ ఆడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఆస్పత్రిపాలు కావడమే కాకుండా.. వైద్యులు పుర్రెలోని సగ భాగాన్ని కోసి తీసేశారు. అయితే అతను నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా ఎదురు కంపెనీ మీద రూ.1.87 కోట్ల పరిహారం చెల్లించాలంటూ కోర్టుకెక్కడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. మైక్ బ్రోకీ అనే 28 ఏళ్ల యువకుడు యూకేలోని రీడింగ్ ప్రాంతంలో నివాసముంటున్నాడు. లండన్ పీడబ్ల్యూసీ కంపెనీలో ఆడిటర్ గా పనిచేసే మైక్ బ్రోకీ 2019లో ఓ నైట్ ఔట్‌లో పాల్గొన్నాడు. తన బాస్ నిర్వహించిన ‘పబ్ గోల్ఫ్’ అనే డ్రింకింగ్ గేమ్‌లో పాల్గొన్నాడు. పాల్గొనడమే కాకుండా అతిగా తాగి ఒక్కసారిగా కుప్పకూలాడు. అతని తల నేలను గట్టిగా తాకడంతో ఆస్పత్రిలో చేర్పించారు.
ఆ తర్వాత బ్రోకీ కోమాలోకి వెళ్లిపోయాడు. అంతేకాకుడాం వైద్యుల అతని పుర్రెలోని సగభాగాన్ని తొలగించారు. 6 నెలల తర్వాత బ్రోకీ స్పృహలోకి వచ్చాడు. 2020లో మైక్ బ్రోకీ నడిచే మిరాకిల్ అంటూ వైద్యుల ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ ఎందుకు వార్తల్లోకి వచ్చాడంటే.. కంపెనీ తనకు పరిహారం చెల్లించాలంటూ బ్రోకీ కోర్టు మెట్లుఎక్కాడు. రూ.1.87 కోట్లు పరిహారంగా ఇప్పించాలంటూ సూట్ వేశాడు.
తన బాస్ పబ్ గోల్ఫ్ నిర్వహించడం వల్లే తనకు ఈ పరిస్థితి వచ్చిందంటూ చెప్పుకొచ్చాడు. మేనేజర్ నిర్లక్ష్యానికి లండన్ పీడబ్ల్యూసీ కంపెనీ బాధ్యత వహించాలంటూ కోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా ఏటా నిర్వహించే వార్షికోత్సవ వేడుకలను కూడా రద్దు చేసింది. ఉద్యోగులు కూడా కాస్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటూ కంపెనీ ప్రతనిధి విజ్ఞప్తి చేశారు. కేసు ఇంకా కోర్టులోనే ఉంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
🍺 PwC is being sued by one of its auditors, after he “lost half of his skull” and was put into an induced coma, following a work event consisting of an “excessive” drinking game of “pub golf.”
The auditor is suing PwC – where he is still employed – for in excess of £200,000. pic.twitter.com/GGPe2DBK57
— TLDR News UK (@TLDRNewsUK) August 22, 2022