చిరునవ్వులు చిందిస్తూ, తన చిట్టి చిట్టి మాటలతో ఆడియన్స్‌ని కట్టిపడేసిన చైల్డ్ ఆర్టిస్ట్ అనుష్క ప్రస్తుతం ఇండియాలో లేదు. డాడీ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చినా.. బాలీవుడ్లోనే ఎక్కువగా సినిమాలు చేసిందట.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘డాడీ’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన అనుష్క మల్హోత్ర తన చిన్ని చిన్ని మాటలతో ప్రేక్షకుల మనసులు దోచేసింది. సురేష్ డైరెక్షన్లో 2001లో ఈ సినిమా తెరకెక్కింది. చిరంజీవికి కూతురుగా నటించిన అనుష్క చందమామ లాంటి ముఖం, చిరునవ్వుతో ‘అక్కి, డాడీ బోత్ ఆర్ ఫ్రెండ్స్’ అంటూ తండ్రిపై ప్రేమను చూపిస్తూ ఆడియన్స్‌ను కట్టిపడేసింది. అక్షయ, ఐశ్వర్య పాత్రల్లో నటించిన ఈ చిన్నారి ఇప్పుడు యూరప్ లో ఉంటుంది. తన ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. మరిన్ని విషయాలను తెలుసుకుందాం..
డాడీ మూవీలో అనుష్క నటించినప్పటికి ఆమెకు నాలుగైదేళ్ల వయసులో ఉంది. ఆ చిన్నది ఇప్పుడు సుమారు 27 సంవత్సారాల అమ్మాయి. ముంబైలోనే పుట్టి పెరిగిన అనుష్క.. ప్రస్తుతం ఇండియాలో లేదు. ఇంగ్లండులోని బర్మింగ్‌హామ్‌లో తన పేరెంట్స్‌తో కలిసి ఉంటుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అండన్‌లో మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ గా జాబ్ చేస్తుంది. డాడీ సినిమా తర్వాత అనుష్కకు బాలీవుడ్లో చాలా ఆఫర్లు వచ్చాయి. బాలీవుడ్ లోనే ఎక్కువ మూవీస్ చేసింది. చదువు సజావుగా కొనసాగాలని అనుష్క తల్లిదండ్రులు ఆమెను సినిమాలకు దూరంగా ఉంచారు. కొన్నాళ్ల తర్వాత వారు బర్మింగ్‌హామ్ వెళ్లిపోవడంతో అక్కడే చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించుకుంది.
వాస్తవానికి ఆమెకు హీరోయిన్ చాన్సులు వచ్చినా కూడా ఆమె మళ్లీ సినిమాలపై ఇన్ట్రెస్ట్ చూపడంలేదు. మీనా, రాశి, కీర్తి సురేష్, నిత్యామీనన్, శ్వేతాబసు ప్రసాద్.. చైల్డ్ ఆర్టిస్ట్ లు హీరోయిన్స్ గా మారిపోయారు. తను ఇండియాలోనే ఉంటే వీరిలా చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోయిన్ గా మారేదేమో కానీ ఆమెకు ప్రస్తుతం ఆసక్తి లేదని తెలుస్తుంది. అనుష్క సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. ఫ్రెండ్స్‌తో పార్టీలు, డ్యాన్స్‌లకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తుంటారు.