డెలివరీ ఏజెంట్ ఉద్యోగాలు ప్రస్తుతం ఎన్నో కుటుంబాలను కాపాడుతున్నాయి. ఎందరో జీవితాలను నిలబెడుతున్నాయి. కుటుంబాలను పోషించడానికి, తమకు తాము ఉపాధి కల్పించుకోవడానికి డెలివరీ ఏజెంట్ ఉద్యోగాలు బాగా ఉపయోగపడుతున్నాయి. అయితే కొందరు కస్టమర్లు డెలివరీ ఏజెంట్స్‌తో దురుసుగా ప్రవర్తించిన సంఘటనలు అనేకం చూశాం. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ యువతి ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన ఏజెంట్ చేతిలో నుంచి ఆర్డర్‌ను లాక్కొవడమే కాక.. అతడిపై దాడి చేసింది. షూ తీసి కొట్టింది. చుట్టూ ఉన్నవారు ఆపడానికి ప్రయత్నించినా.. వారి మాట వినలేదు. కొందరు జరిగిన తతంగాన్ని వీడియో తీశారు. ఈ క్రమంలో యువతి తీసుకెళ్లిన ఫుడ్‌ని ఆర్డర్ చేసిన అసలు కస్టమర్ రంగంలోకి దిగి.. జరిగిన సంఘటన గురించి ట్వీట్ చేయడమే కాక యువతి దాడి చేసే వీడియోని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుంది అనే వివరాలు లేవు. ఇక డీజే అనే వ్యక్తి దాడికి సంబంధించిన వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. దీనిలో ఓ యువతి.. జొమాటో డెలివరీ ఏజెంట్ నుంచి ఫుడ్ లాక్కుంటుంది. వారు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తారు. కానీ అవేం పట్టించుకోకుండా.. షూ తీసుకుని.. డెలివరీ బాయ్‌పై దాడి చేస్తుంది. ఆ చుట్టూపక్కల ఉన్నవారు.. ఆపడానికి ప్రయత్నించినా ఆమె శాంతించలేదు. ఆనక ఆర్డర్ తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత సదరు డెలివరీ బాయ్.. ఎవరి కోసమైతే ఫుడ్ తీసుకొచ్చాడో.. ఆ కస్టమర్ వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్తాడు. దాంతో సదరు కస్టమర్ జొమాటో కస్టమర్ కేర్‌ని ట్యాగ్ చేసి.. జరిగిన విషయాన్ని వెల్లడిస్తాడు. సదరు ఏజెంట్ తన ఆర్డర్‌ని డెలివరీ చేయడానికి వచ్చాడని.. కానీ ఇంతలో ఓ గుర్తు తెలియని యువతి వచ్చి.. ఆర్డర్‌ని తీసుకోవడమే కాక.. తనపై చెప్పులతో దాడి చేసిందిన చెప్పుకొచ్చాడు. డెలివరీ బాయ్ తన దగ్గరకు వచ్చి.. జరిగిన విషయం చెప్పి.. తన జాబ్ పోతుందని ఏడ్చినట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వీడియో వైరల్ కాగా.. సదరు యువతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Hi @zomatocare @zomato, the delivery executive got assaulted while delivering my order (#4267443050). Some woman took the order from him and started hitting him with her footwear. He came to my place crying and terrified that he would lose his job. pic.twitter.com/8VQIaKVebz — dj (@bogas04) August 15, 2022 ఇది కూడా చదవండి: వీడియో: పిల్లలతో కలిసి ఫుడ్ డెలివరీ.. ఆ తండ్రి ప్రేమపై నెటిజన్ల ప్రశంసలు! ఇది కూడా చదవండి: Zomato డెలివరీ బాయ్‌ను ఆదుకున్న నెటిజన్లు.. గంటల వ్యవధిలో బైక్ కొనిచ్చారు!