ప్రేమ గుడ్డిది అంటారు చాలా మంది. అవును దానికి కులం, మతం, అంతస్తుతోపాటు.. వయసుతో కూడా పనిలేదు. ఇప్పటికే మన సమాజంలో వయసులో తమ కన్నా పెద్దవారిని పెళ్లి చేసుకున్నవారు చాలా మంది ఉన్నారు. ఎక్కడిదాకో ఎందుకు క్రికెట్ అభిమానులు దేవుడిలా భావించే సచిన్.. తన కన్నా వయసులో ఐదేళ్ల పెద్దదయిన అంజలిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ వయసు ప్రస్తావన ఎందుకు అంటే.. ప్రస్తుతం ఓ ప్రేమ జంట గురించి ప్రపంచం అంతా మాట్లాడుతుంది. కొందరు నిజమైన ప్రేమ అంటుండగా.. మరి కొందరు వేలం వెర్రి అంటున్నారు. ఏది ఏమైతేనేం.. వారి ప్రేమ కథ మాత్రం ఖండాలు దాటి ప్రపంచం అంతా చర్చించుకునే స్థాయికి ఎదిగింది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: ప్రేయసి కోసం ఎవరు చేయలేని త్యాగం చేశాడు.. కానీ చివరకి
రోమ్ నగరానికి చెందిన ఖురాన్ అనే 24 ఏళ్ల వ్యక్తి టిక్‌టాక్ వీడియోలు చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. ఈ క్రమంలో అతడికి మరో టిక్‌టాక్ స్టార్ చెరిల్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. దీనిలో ఏం వింత ఉంది అనుకుంటే.. సదరు టిక్‌టాకార్ మహిళ వయసు ఏకంగా 61 సంవతర్సాలు. నమ్మశక్యంగా లేకపోయినా.. ఇది వాస్తవం. చెరిల్‌పై మనసు పారేసుకున్న ఖురాన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన మనసులోని మాటను ఆమెకు చెప్పేశాడు.
ఇది కూడా చదవండి: చేతులు పోయాయని భర్త వదిలేశాడు! ఇప్పుడు ఆమె పెద్ద స్టార్! రియల్ స్టోరీ!
చెరిల్ కూడా ఖురాన్ ప్రేమని అంగీకరించింది. 2021 నుంచి కలిసి వీడియోలు చేయడం ప్రారంభించారు. వీరి వీడియోలు నెటిజనులకు కనెక్ట్ అయితే.. వీరిద్దరూ కూడా ఒకరికొకరు బాగానే కనెక్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే 2021, జూలైలో ఖురాన్ టిక్‌టాక్ వీడియోల మీద వచ్చిన డబ్బులతో ఓ ఉంగరం కొని.. చెరిల్ వేలికి తొడిగి.. తన మనసులోని ప్రేమను వెల్లడించాడు. అప్పటికే కూతుళ్లు, మనవరాళ్లు ఉన్న చెరిల్‌కి కూడా ఖురాన్ వ్యక్తిత్వం, నిష్కల్మషమైన ప్రేమను చూసి అతడికి ఫిదా అయ్యింది. వెంటనే ఓకే చెప్పింది. కుటుంబం, సమాజం ఏమనుకున్న మాకు అక్కర్లేదు.. అంటూ ప్రేమలో మునిగి తేలుతున్నారు ఈ జంట. అంతేకాదండోయ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేందుకు కూడా సిద్ధం అవుతున్నారట. ఈ ప్రేమ కహానీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: గర్భిణీల కష్టాలు తెలుసుకోవాలనుకున్న టిక్‌టాకర్.. వీడియో వైరల్