చేతులు పోయాయని భర్త వదిలేశాడు! ఇప్పుడు ఆమె పెద్ద స్టార్! రియల్ స్టోరీ!

ఎవరి జీవితంలోనైనా కష్టాలు, కన్నీరు కల కాలం ఉండిపోవు. దేవుడు పెట్టే కొన్ని కఠిన పరీక్షలను దైర్యంగా ఎదుర్కోగలిగితే చాలు. మళ్ళీ వెలుగువైపు వైపు అడుగులు వేయవచ్చు. కానీ.., జీవితం పట్ల ఆశని కోల్పోకుండా ఇలా పోరాట స్ఫూర్తిని చూపే వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలాంటి స్ఫూర్తికారకమైన కథే నేపాల్‌కు చెందిన మేఘనా గిమిరే ది. అందమైన రూపం. ప్రాణానికి ప్రాణంగా చూసుకునే తల్లి. మనసు పడ్డ మగ తోడు. ఇంతకన్నా స్త్రీకి అద్భుతమైన ప్రపంచం ఏముంటుంది? మేఘనా గిమిరే జీవితం ఇలానే అద్భుతంగా సాగిపోతూ ఉండింది. కానీ.., ఆమె ఆనందం చూసి విధికి కన్ను కుట్టింది. ఉహించని ఓ పెను ప్రమాదం ఆమె జీవితాన్ని చిదిమేసింది. హైటెన్షన్ వైరను పొరపాటున తాకడంతో ఆమె కరెంట్ షాక్‌కు గురైంది. ఈ ప్రమాదంలో ఆమె చేతులు పోగొట్టుకోవాల్సి వచ్చింది. అందమైన భార్య వికలాంగురాలు అయ్యేసరికి ఆ భర్త నిజ స్వరూపం బయటపడింది. కష్టాల్లో ఆదుకోవాల్సిన భర్త ఆమెని వదిలేశాడు. దీంతో.., మేఘన దిక్కు తోచని స్థితిలో ఉండిపోయింది. కట్టుకున్న వాడు వదిలేసినా.., కన్నప్రేమ మేఘనా గిమిరే ని అక్కున చేర్చుకుంది. తిండి పెట్టడం, స్నానం చేపించడం, బట్టలు మార్చడం ఇలా అన్నీ కన్నతల్లి దగ్గరే ఉండి చూసుకోసాగింది. తల్లి చూపించిన ప్రేమ మేఘనాలో జీవితం పట్ల ఆశని రగిలించింది.

tik 2చిన్నగా ఆమె కాళ్లతో పనులు చేసుకోవడం మొదలు పెట్టింది. ఇంతలో అనుకొకుండా ఆమె జీవితంలోకి టిక్ టాక్ వచ్చింది. ఒకరోజు సరదాగా మొబైల్‌ను కాళ్లను ఆపరేట్ చేస్తూ.. టిక్‌టాక్ చూసింది. ఇక్కడ నుండి మేఘన టిక్‌టాక్‌లో వీడియోలు అప్లోడ్ చేయడం మొదలుపెట్టింది. ఆ వీడియోల్లో ఆమె ఆత్మవిశ్వాసానికి లక్షల మంది ఫిదా అయ్యారు. తక్కువ టైంలోనే మేఘన టిక్‌టాక్ వీడియోస్ కి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం టిక్‌టాక్‌లో ఆమెకు ఇరవై లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దేశ, విదేశాల నుండి ఆమెకి ఫాలోవర్స్ వచ్చి చేరారు. అలా వచ్చిన ఫాలోవర్స్ మేఘనా గిమిరే కష్టాన్ని చూసి చలించిపోయారు. ఆమె కోసం వారే ఫండ్ రైజింగ్ స్టార్ట్ చేశారు. వాళ్లు అందించిన డబ్బు సాయంతోనే ఆమె అమెరికా వెళ్లగలిగింది. అక్కడి డాక్టర్ల పర్యవేక్షణలో ప్రోస్తటిక్ చేతుల్ని అందుకుంది. ప్రస్తుతం చిరునవ్వుతో ఆమె చేసే సరదా వీడియోలు లక్షల మందికి ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఆమె స్వానుభవంతో ఇస్తున్న సందేశాలు లక్షల మందిని ఆలోచింప చేస్తున్నాయి. టిక్ టాక్ అంటే కేవలం వల్గర్ వీడియోస్ మాత్రమే అనుకునే వారు కూడా మేఘనా మాటలకి ముగ్ధులు అవుతున్నారు. మేఘన ఇప్పుడు జీవితంలో ఓ విజేతగా నిలవగలిగింగి. కష్ట సమయంలో తన తల్లి చూపించిన ప్రేమే మళ్ళీ తాను జీవితాన్ని లీడ్ చేయడానికి కారణం అయ్యింది అని ఆమె కన్నీరు పెట్టుకుంటు చెప్పుకొచ్చింది. చూశారు కదా..? ఇది మేఘనా గిమిరే స్ఫూర్తిదాయకమైన జీవిత ప్రయాణం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.