విద్యార్థులకు విద్యా బుద్దులు చెప్పి వారి ఉన్నతికి పాటు పడే ఉపాధ్యాయులను అందరూ గౌరవిస్తారు. గురువులను దైవంతో భావిస్తారు. కానీ ఈ మధ్య కాలంలో కొంత మంది టీచర్స్ అనుచిత ప్రవర్తనల వల్ల వారి పట్ల ఉండే గౌరవ మర్యాదలు తగ్గిపోతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి ఓ టీచరమ్మ తరగతి గదిలో విద్యార్థులతో అసభ్యకరమైన రీతిలో డాన్స్ చేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరి ఆ తరువాత ఏం జరిగింది? పాఠశాల యాజమాన్యం ఏవిధంగా స్పందించిందో తెలుసుకుందాం పదండి..

బ్రెజిల్ లో ఓ ఉపాధ్యాయురాలు తరగతి గదిలో బోధన సమయంలో విద్యార్థులతో అసభ్యకరంగా డాన్స్ చేస్తూ ప్రవర్తించిన తీరు చర్చనీయాంశంగా మారింది. సిబెల్లీ ఫెరీరా బ్రెజిల్ లోని ఓ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆక్టీవ్ గా ఉండే తను టిక్ టాక్ లో 9.8 మిలియన్ల మంది ఫాలోవర్లను, ఇన్ స్టాగ్రామ్ లో 1.2 మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. అయితే క్లాస్ రూంలో విద్యార్థులను బోధన దిశగా ఆకర్షించేందుకు ఆమె అసభ్యకరంగా డాన్స్ చేసింది. ఆ వీడియోలను టిక్ టాక్ లో పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు సిబెల్లీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సరైన వస్త్రధారణ లేకుండా విద్యార్థులతో స్టెప్పులేయడం, హగ్ చేసుకోవడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంకొంతమందేమో బోధనను వినోదభరితంగా అందిస్తున్నారంటూ మద్దతు తెలుపుతున్నారు. ఈ వ్యవహారంపై ఆరా తీసిన పాఠశాల యాజమాన్యం ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ విషయాన్ని అక్కడి స్థానిక మీడియా దృవీకరించింది. విద్యార్థులకు బోధనపై ఆసక్తిని పెంచేందుకు ఇలా డాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్న టీచర్ ను ఉద్యోగంలోంచి తీసేయడం సబబు కాదని సోషల్ మీడియా వేదికగా కొందరు స్పందిస్తున్నారు. మరి తరగతి గదిలో ఉపాధ్యాయురాలు విద్యార్థులతో డాన్స్ చేయడం పట్ల మీరేమనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#ULTIMAHORA 🚨| Despiden a Cibelly Ferreira, maestra 👩🏫🏫👩🔬que ha enamorado a todo el mundo bailando de una manera sensual y divertida en el aula acompañada de sus alumnos. ✏️🎒🏫 #Lamentable despido‼️@Jess624805541 pic.twitter.com/CzEHXPyxzl
— Jesús_LuchadorSocial (@Jess62480554) May 9, 2023