ఇటీవల కాలంలో హార్ట్ ఎటాక్ మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. మరీ ముఖ్యంగా యువత దీని కారణంగా మృత్యువాత పడుతున్నారు. నటుడు తారకరత్న నుండి మొన్న జిమ్ చేసేందుకు వెళ్లిన కానిస్టేబుల్ తో సహా అంతా 40 ఏళ్ల లోపు వారే. తాజాగా మరో విషాదం హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
ఎందుకో గుండె గట్టిగా బాధ పెట్టుకుంటోంది. తీవ్ర ఇబ్బందికి గురౌతుంది. ఇటీవల కాలంలో గుండె పోటుతో మరణిస్తున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. చిన్న వయసు పిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు గుండె పోటుకు గురౌతున్నారు. నిండా 40 ఏళ్లు కూడా ఉండటం లేదు హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు. ఆహార వ్యవహారాల్లో లోపమా, మానసిక ఒత్తిడా.. లేదా కరోనా అనంతర పరిస్థితులు దీనికి దారి తీస్తున్నాయో తెలియడం లేదు. మొన్నటికి మొన్నహార్ట్ ఎటాక్ కారణంగా నటుడు తారకరత్న చిన్నవయస్సులోనే కుటుంబాన్ని, అభిమానుల్ని శోక సంద్రంలో వదిలి అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ఓ పదో తరగతి విద్యార్థిని, మొన్న ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్, పెళ్లిలో వరుడ్ని అలంకరిస్తూ ఓ వ్యక్తి, జిమ్ లో ఓ యువ కానిస్టేబుల్ వీరంతా గుండె పోటుతో మరణించినవారే.
తాజాగా మరో విషాదం సికింద్రాబాద్‌లో చోటుచేసుకుంది. లాలాపేట స్టేడియంలో ఓ వ్యక్తి బ్యాడ్మింటన్ ఆడుతుండగా ఒక్కసారిగా నేలకొరిగాడు. ప్రొఫెసర్ జయ్ శంకర్ ఇండోర్ స్టేడియంలో షడిల్ ఆడేందుకు వచ్చిన శ్యామ్ యాదవ్ అనే యువకుడు హార్ట్ స్ట్రోక్‌కు గురయ్యాడు. ఉన్నపళంగా నేలకొరిగాడు. ఆసుప్రతికి తరలించగా.. వైద్యులు గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారించారు. ప్రతి రోజు సెటిల్ ఆడేందుకు శ్యామ్ యాదవ్ ఆ స్టేడియానికి వెళుతుంటాడు. మంగళవారం కూడా అలా వెళ్లిన వ్యక్తి .. ఇంటికి శవమై చేరాడు. తమతో పాటు షటిల్ ఆడే వ్యక్తి ఒక్కసారిగా ఇలా నేలకొరగడంతో అక్కడి వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. మస్కట్ లో కూడా ఇటీవల ఓ వ్యక్తి బ్యాడ్మింటన్ ఆడుతూ నేలకొరిగిన సంగతి విదితమే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
A 38-year-old man #ShyamYadav died after he suffered a #cardiac arrest while playing #badminton at a stadium in Hyderabad’s Lalapet on Tuesday evening,this is fourth death till now.. #Hyderabad pic.twitter.com/RESGoEfIMx
— Arbaaz The Great (@ArbaazTheGreat1) March 1, 2023