అమెరికా- చైనా మధ్య నెలకొన్న అనిశ్చిత వాతావరణం వల్ల ఎన్నో సంస్థలు, తయారీ యూనిట్లు అయోమయంలో పడిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే తైవాన్ కు చెందిన యాపిల్ ఫోన్ తయారీ సంస్థ ఫాక్స్ కాన్ తమ యూనిట్ ని చైనా నుంచి భారత్ తరలించేందుకు నిర్ణయం తీసుకుంది. భారత్ లో మొత్తం రెండు తయారీ యూనిట్లు స్థాపించనున్నారు. ఇప్పటికే బెంగళూరులో ఒకటి స్థాపించనుండగా.. ఇప్పుడు మరో యూనిట్ ని తెలంగాణలో నెలకొల్పనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు రాష్ట్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలోనే ఒకేసారి దాదాపుగా లక్షమందికి పైగా ఉపాధి అవకాశాలు దక్కనున్నట్లు తెలిపింది. తైవాన్ కు చెందిన యాపిల్ ఫోన్ తయారీ సంస్థ హోన్ హై ఫాక్స్ కాన్ తమ కంపెనీకి చెందిన తయారీ యూనిట్ ని తెలంగాణలో స్థాపించనున్నట్లు ప్రకటించింది. ఆ విషయాన్ని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో స్వయంగా ఫాక్స్ కాన్ కంపెనీ ఛైర్మన్ ‘యంగ్ ల్యూ’ వెల్లడించారు. తాము రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నామని త్వరలోనే పనులు ప్రారంభిద్దామని వెల్లడించారు. ఇటీవల బెంగళూరులో కూడా ఫాక్స్ కాన్ సంస్థ తమ తయారీ కేంద్రాన్ని పెట్టేందుకు ప్రభుత్వాన్ని సంప్రదించిన విషయం తెలిసిందే.
తెలంగాణలో త్వరలోనే యాపిల్ ఫోన్ తయారీ సంస్థ హోన్ హై ఫాక్స్ కాన్ తమ తయారీ యూనిట్ ని ప్రారంభించినుంది. మార్చి 2న ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆ సంస్థ ఛైర్మన్ యంగ్ ల్యూ సమావేశమైన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా పెట్టుబడులకు సంబంధించి ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అందుకు తగినట్లుగానే ఆ సంస్థ నుంచి యంగ్ ల్యూ పేరిట రాష్ట్ర ప్రభుత్వానికి ఓ అధికారిక లేఖ అందింది. అందులో తాము పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ముందుగా అనుకున్న విధంగానే రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్ లో ఫాక్స్ కాన్ ప్లాంట్ తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
హైదరాబాద్ పర్యటనలో తమకు అందించిన ఆతిథ్యాన్ని కూడా యంగ్ ల్యూ మెచ్చుకున్నారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కేసీఆర్ విజన్ చూసి తాను స్ఫూర్తి పొందినట్లు యంగ్ ల్యూ వెల్లడించారు. ఆరోజు తన పుట్టినరోజు కావడంతో.. సీఎం కేసీఆర్ వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలుపుతూ కార్డ్ ఇవ్వడాన్ని ప్రశంసించారు. సీఎం కేసీఆర్ ని తమ వ్యక్తిగత అతిథిగా తైవాన్ కు ఆహ్వానించారు. తమ ముఖ్య అతిథిగా తైవాన్ వచ్చి.. వారి ఆతిథ్యాన్ని స్వీకరించాలని కోరారు. ఈ ఫాక్స్ కాన్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు 250 ఎకరాలు అవసరం కాగా.. సర్వే నంబర్ 300లోని 187 ఎకరాలను ఫాక్స్ కాన్ సంస్థకు ప్రభుత్వం కేటాయించినట్లు తెలుస్తోంది.
During his meeting with Chief Minister Sri K. Chandrashekar Rao, @HonHai_Foxconn Chairman, Mr. Young Liu has announced the company’s decision to set up electronics manufacturing facilities in Hyderabad. pic.twitter.com/Epmox5pgfg
— Telangana CMO (@TelanganaCMO) March 2, 2023
అంతేకాకుండా ఈ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు లక్షమందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. ఇప్పటికే బెంగళూరులో తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఫాక్స్ కాన్ కంపెనీ కర్ణాటక ప్రభుత్వాన్ని సంప్రదించిన విషయం తెలిసిందే. కర్ణాటక ప్రభుత్వం- ఫాక్స్ కాన్ సంస్థ మధ్య ఒప్పందం కుదిరిన తర్వాతే ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై బెంగళూరులో 300 ఎకరాల్లో ఐఫోన్ తయారీ కేంద్ర రాబోతున్నట్లు ప్రకటించారు. బెంగళూరు ఎయిర్ పోర్ట్ సమీపంలోని దొడ్డబల్లాపూర్, దేవంగల్లి ప్రాంతంలో 300 ఎకరాలు గుర్తించినట్లు తెలుస్తోంది.
బెంగళూరులో ఏర్పాటు చేసే ప్లాంట్ ద్వారా కూడా దాదాపు లక్ష మంది వరకు ఉపాధి లభించనుంది. అమెరికా- చైనా మధ్య నెలకొన్ని అనిశ్చితి కారణంగానే తైవాన్ కు చెందిన ఫాక్స్ కాన్ సంస్థ తమ తయారీ యూనిట్ ని ఇండియాకి తరలిస్తోంది. చైనాలో ఉన్న ప్లాంట్ ద్వారా దాదాపు 2 లక్షల మందికి ఉపాధి లభించేది. తైవాన్ కు చెందిన యాపిల్ ఫోన్ తయారీ కేంద్రం చైనా నుంచి ఇండియాకి రావడం మన ఆర్థిక వ్యవస్థ పురోగతికి మేలు చేస్తుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు ఇది దోహదం చేస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Chairman, @HonHai_Foxconn Mr. Young Liu, in a letter addressed to CM Sri KCR, has stated that he was inspired by the vision and efforts of the #Telangana CM towards transformation and development of the State. pic.twitter.com/dJ82MinS14
— Telangana CMO (@TelanganaCMO) March 6, 2023