తెలంగాణలో రాజ్‌భవన్ వర్సెస్ ప్రగతి భవన్ మధ్య వివాదం సమసిపోలేదు.. గవర్నర్, సీఎంల దూరం తగ్గకపోగా.. రాను రాను మరింత పెరుగుతోంది. తాజాగా గతతంత్ర దినోత్సవ వేడుకలు రణతంత్రంగా మారాయి. చివరకు హైకోర్టు జోక్యం చేసుకుని.. గణతంత్ర దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహించాలని సూచించడం ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితికి అద్దం పడుతోంది. ఇక గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గవర్నర్ తమిళి సై సౌందరరాజన్.. మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ప్రస్తుతం ఈ […]
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ వెల్లివిరుస్తోంది. సంక్రాంతికి కోడి పందేలు, గాలిపటాలు, పిండి వంటలు ఎలాగో.. ప్రేక్షకులకు సినిమాలు కూడా అంతేే ప్రత్యేకం. అందుకే టాలీవుడ్ కి సంక్రాంతి అంత స్పెషల్. ఈసారి ఇంకో స్పెషల్ ఏంటంటే.. ఒకే నిర్మాణ సంస్థ తెరకెక్కించిన రెండు సినిమాలు ఒకరోజు గ్యాప్ లో విడుదల కానున్నాయి. జనవరి 12న వీర సింహారెడ్డిగా బాలయ్య వస్తుండగా.. జనవరి 13న వాల్తేరు వీరయ్యగా మెగాస్టార్ చిరంజీవి సందడి చేయనున్న విషయం తెలిసిందే. […]
తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు.. పెట్టుబడి సాయంగా.. ఎకరాకు ఐదు వేల రూపాయల చొప్పున రైతు బంధు పేరిట ఆర్థిక సాయం అందచేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే కేవలం రైతులకు మాత్రమే.. అది కూడా భూపరిమితి లేకుండా.. ఈ సాయాన్ని అందజేస్తున్నారు. ఏటా రెండు సార్లు.. ఎకరాలకు ఐదు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. అయితే ఈ పథకంపై అనేక విమర్శలు కూడా ఉన్నాయి. వందల ఎకరాల భూమి ఉన్న వారికి కూడా […]
ప్రజల సంక్షేమం, వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచడమే మా లక్ష్యం.. ఆ దిశగానే మేం పనిచేస్తాం అంటూ ఇప్పటికే చాలా సందర్భాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రారంభం సందర్భంగా అదే విషయాన్ని మరోసారి నొక్కి వక్కాణించారు. అందులో భాగంగానే వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు కేసీఆర్ సర్కార్ పింఛన్ ఇస్తోందన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కేసీఆర్ సర్కార్ వద్దకు కొత్త డిమాండ్ వచ్చింది. తమకు కూడా పింఛన్ కావాలంటూ బట్టతల బాధితులు డిమాండ్ […]
ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రోత్సాహకంగా ప్రభుత్వాలు ఆయా పథకాల పేరుతో కొంత డబ్బుని ఇస్తుంటాయి. కుల వృత్తులు, చేతి వృత్తులు ఆధారంగా వివిధ పథకాల ద్వారా డబ్బుని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గొర్రెల పంపిణీ పథకంలో చేరిన లబ్దిదారులకు గొర్రెలు స్వయంగా కొనుగోలు చేసుకునేందుకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో ఉన్న లబ్ధిదారులకు […]
మరి కొన్ని గంటల్లో.. 2022 ముగియనుంది. కొత్త ఏడాది 2023కు సరికొత్తగా స్వాగతం పలకనున్నాం. ఏడాది కాలం అంటే 365 రోజులు. ప్రతి రోజు ఆసక్తికరంగా సాగకపోవచ్చు. కానీ అప్పుడప్పుడు చోటు చేసుకున్న సంఘటనలు.. ఆ ఏడాది మొత్తం.. కొన్నైతే.. ఏళ్ల పాటు ప్రభావం చూపుతాయి. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో చోటు చేసుకునే సంఘటనలు.. ఆ రాష్ట్ర రాజకీయ భవిషత్తుపై ప్రభావం చూపుతాయి. మరి 2022లో రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న కీలక రాజకీయ పరిణమామలు […]
దేశంలోని అందరు ముఖ్యమంత్రులకు సంబంధించిన ఆస్తులు, క్రిమినల్ కేసులు, గన్ లైసెన్సులు, వ్యక్తిగత వాహనాలు, స్థిరాస్తులు ఇలా మొత్తం 7 అంశాలతో ఒక నివేదిక విడుదలైంది. ప్రముఖ ఆంగ్ల వెబ్ సైట్ ది ప్రింట్ ఈ నివేదికను సిద్ధం చేసింది. ఇందులో చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఈ వివరాలు అన్నీ ముఖ్యమంత్రులు సమర్పించే అఫిడవిట్ల ఆధారంగా తయారు చేసినట్లు తెలిపారు. ది ప్రిట్ పత్రిక నివేదిక ప్రకారం.. దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా జగన్ […]
మరికొన్ని రోజుల్లో.. 2022 ముగియనుంది.. నూతన సంవత్సరం 2023 ప్రారంభం కానుంది. ఇక నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్.. న్యూఇయర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. అది కూడా ఎవరు ఊహించని రేంజ్‌లో. ఇంతకు ఏంటా గిఫ్ట్ అంటే.. జనాల ఖాతాల్లో లక్ష రూపాయలు జమ చేయనున్నారు. ఏంటి.. ఇది మరో కొత్త పథకమా.. ఎలా అప్లై చేయాలి.. ఎవరు అర్హులు అని ఆలోచిస్తున్నారా.. అయితే ఆగండి.. ముందు ఈవార్త పూర్తిగా చదవండి. 2023లో తెలంగాణలో […]
రాజకీయాల సంగతి పక్కన పెడితే.. తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ చేసిన కృషిని.. తెలంగాణ సమాజం ఎన్నటికి మరిచిపోదు. రాష్ట్ర సాధన కోసం పార్టీ స్థాపించి.. సుమారు 14 ఏళ్ల పాటు అనితర పోరాటం చేసి.. ఎన్నో ఉద్యోమాలు, ఆందోళనలు చేపట్టి.. తెలంగాణ వాసులు 60 ఏళ్ల కలను నిజం చేశారు కేసీఆర్. ఉద్యమంలో ఎందరో పాల్గొన్నప్పటికి.. దాన్ని ముందుకు తీసుకెళ్లిన బలమైన శక్తి మాత్రం కేసీఆర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తెలంగాణ ప్రత్యేక […]
సుమారు 21 ఏళ్ల క్రితం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే ధ్యేయంగా.. పార్టీ స్థాపించాడు తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు. సుమారు 13 ఏళ్ల పాటు నిరంతరంగా శ్రమించి.. ఎన్నో పోరాటాలు చేసి ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చాడు. 60 ఏళ్ల తెలంగాణ వాసుల కల సాకారం కావడంలో కేసీఆర్ ప్రధాన పాత్ర పోషించారనడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత.. రెండు సార్లు.. పోటీ చేసి.. విజయం సాధించి.. ముఖ్యమంత్రిగా గెలిచారు. తెలంగాణను అభివృద్ధి పథంలో […]