అమెరికా- చైనా మధ్య నెలకొన్న అనిశ్చిత వాతావరణం వల్ల ఎన్నో సంస్థలు, తయారీ యూనిట్లు అయోమయంలో పడిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే తైవాన్ కు చెందిన యాపిల్ ఫోన్ తయారీ సంస్థ ఫాక్స్ కాన్ తమ యూనిట్ ని చైనా నుంచి భారత్ తరలించేందుకు నిర్ణయం తీసుకుంది. భారత్ లో మొత్తం రెండు తయారీ యూనిట్లు స్థాపించనున్నారు. ఇప్పటికే బెంగళూరులో ఒకటి స్థాపించనుండగా.. ఇప్పుడు మరో యూనిట్ ని తెలంగాణలో నెలకొల్పనున్నారు.
KCR: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని కుట్రలు చేసి రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొడుతున్నారని మండిపడ్డారు. ఈ ప్రధాని మనకు కావాలా? అని ప్రశ్నించారు. గురువారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కొంగరకలాన్‌లో నిర్మించిన కొత్త కలెక్టరేట్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘ తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో రంగారెడ్డి […]