KCR: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని కుట్రలు చేసి రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొడుతున్నారని మండిపడ్డారు. ఈ ప్రధాని మనకు కావాలా? అని ప్రశ్నించారు. గురువారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కొంగరకలాన్‌లో నిర్మించిన కొత్త కలెక్టరేట్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘ తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో రంగారెడ్డి జిల్లాలో అనేక రకాల తప్పుడు ప్రచారాలు చేశారు.
ఇక్కడ భూముల ధరలు పడిపోతాయని, తెలంగాణ రాష్ట్రం వస్తే లాభం లేదని అనేక రకాలుగా చెప్పారు. 15 సంవత్సరాల పోరాటం తర్వాత రంగారెడ్డి జిల్లా సాధించుకున్నాం.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రైతు బంధు, రైతు బీమాలాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవు. పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. దళారి వ్యవస్థ తెలంగాణలో లేదు. 24 గంటల కరెంట్ కూడా అందుబాటులో ఉంది. మనం నిద్రపోతే పెద్ద ప్రమాదానికి గురవుతాం. తెలంగాణను కాపాడే బాధ్యత నాది. పంటల తెలంగాణ కావాలా? మంటల తెలంగాణ కావాలా?.. కేంద్రం ఒక్క మంచిపనైనా చేసిందా? మౌనంగా బరిద్దామా?
ఈ ప్రధాని మనకు కావాలా? హైదరాబాద్‌లో 24 గంటలు కరెంట్ ఉంటే ఢిల్లీలో ఉండదు. ప్రధాని కుట్రలు చేసి రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొడుతున్నారు. తమిళనాడు, ఢిల్లీ, బెంగాల్‌లో ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మౌనంగా భరిస్తే.. మత చిచ్చు పెట్టే మంటలు వస్తాయి. బెంగళూరు తరహా గొడవలు జరిగితే మన దగ్గర పరిశ్రమలు వస్తాయా? కొందరు మతం మంటలు పెడితే మనం చూస్తూ ఉండాలా?’’ అని ప్రశ్నించారు. మరి, ప్రధానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. ఇళ్ల స్థలాల కేటాయింపులో సుప్రీం కీలక ఆదేశాలు!