ఇటీవల హైదరాబాద్ నగరంలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఓ డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇపుడు మైక్రోసాఫ్ట్ ఇండియా ముందుకు వచ్చింది. ఈ కేంద్రాన్ని రూ.1500 కోట్ల వ్యయంతో నెలకొల్పనున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో దీన్ని ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు ప్రభుత్వంతో ఆ సంస్థ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. చర్చలు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.
ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యయాలు తక్కువగా ఉండడానికి తోడు ప్రభుత్వ సానుకూల విధానాలు, ఐటీ నిపుణుల లభ్యత ఎక్కువగా ఉండడం వల్లే ఇక్కడ డేటా కేంద్రాల ఏర్పాటుకు కంపెనీలు ముందుకొస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం మన దేశంలో ఉన్న డేటా సెంటర్ల సామర్థ్యం 30 మెగావాట్లు ఉండగా, 2023 నాటికి ఈ సామర్థ్యం 96 మెగావాట్లకు పెరుగుతుందని కన్సల్టింగ్ సేవల సంస్థ జేఎల్ఎల్ అంచనా వేసింది.
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులకు ఒక్కొక్కరికి 1,500 డాలర్ల(రూ.1.12 లక్షలు) సింగిల్ టైం బోనస్ ప్రకటించింది. మహమ్మారి మూలంగా కష్టంగా గడిచిన ఆర్థిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలో ఉద్యోగుల కృషికి గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.
కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ కంటే కింది స్థాయి ఉద్యోగులందరికీ ఈ బోనస్ వర్తిస్తుందని పేర్కొంది. మార్చి 31, 2021కి ముందు ఉన్న ఉద్యోగులందరికీ ఈ బహుమానం ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌కు 1,75,508 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరందరి బోనస్ కోసం సంస్థ 200 మిలియన్ డాలర్లు అదనంగా కేటాయించనుంది.
కంపెనీ అనుబంధ సంస్థలైన లింక్డిన్, గిట్‌హబ్, జెనీమ్యాక్స్‌కు చెందిన ఉద్యోగులు మాత్రం బోనస్‌కు అర్హులు కాదు. ఫేస్‌బుక్ తమ సంస్థలోని 45 వేల మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి 1,000 డాలర్ల బోనస్ ప్రకటించిన విషయం తెలిసిందే. హాలిడే బోనస్ కింద అమెజాన్ సైతం 300 డాలర్లు ప్రకటించింది.
ఈ సమాచారం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజెయ్యండి.