సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటే ఓ కలల ప్రపంచం. ఏసీ రూములో హాయిగా కంప్యూటర్ ముందు కూర్చొని పని, వారాంతంలో రెండు రోజులు సెలవులు, అప్పుడప్పుడు విదేశీ టూర్లు.. ఊహించుకుంటేనే ఎంత బాగుందో అనిపించేది. కానీ ఇప్పుడు మన ఉద్యోగాలు ఉంటాయంటావా..? అని ఒకరొకరు ప్రశ్నించుకుంటున్నారు.
ఉద్యోగాల కోతపరంపర కొనసాగుతున్న సంగతి అందరికీ విదితమే. అగ్ర సంస్థల మొదలు చిన్నా చితక కంపనీల వరకు అన్నీ ఉద్యోగులకు షాక్ ఇస్తూనే వస్తున్నాయి. కొత్త ప్రాజెక్ట్ లు లేవన్న కారణంతో సగం మందిని ఇంటికి పంపిస్తుండగా.. మరికొన్ని సంస్థలు ఉన్న ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తున్నాయి. ఇలాంటి వేల ఇక ప్రెషర్స్ కష్టాలు వర్ణనాతీతం అని చెప్పాలి. సగం జీతం ఇస్తాం.. ఇష్టమైతే చేయండి లేదంటే మానెయ్యండి అంటూ ఐటీ కంపెనీలు ఖరాఖండీగా చెప్పేస్తున్నాయట. దీంతో ప్రెషర్స్ ఎందుకు సాఫ్ట్ వేర్ రంగం ఎంచుకున్నామా..? అని తలలు పట్టుకుంటున్నారని వినికిడి.
ఆర్థిక మాంద్యం భయాలో.. ఖర్చు తగ్గించుకోవాలనుకున్న ఆశలో కానీ ఐటీ ఉద్యోగుల.. ఉద్యోగాలు ఊడుతున్నాయన్నది వాస్తవం. అమెజాన్, ఐబీఎం, ఆపిల్, మెటా, మైక్రోసాఫ్ట్, యాక్సెంచర్.. ఇలా అన్ని దిగ్గజ సంస్థలు ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి. ఇలాంటి పరిస్థితులలో ఇక ప్రెషర్స్ కష్టాలు మాటల్లో వర్ణించలేం. మంచి కంపనీలో ఉద్యోగం వచ్చిందన్న వారి ఆశలు ఆరంభంలోనే అడియాశలు అవుతున్నాయి. ఆఫర్ చేసిన వార్షిక వేతన ప్యాకేజీకి బదులు సగం జీతానికి పనిచేయాలని టెక్ కంపెనీలు ఒత్తిడి తెస్తున్నాయట. ఈ మేరకు ఉద్యోగాలకు ఎంపికైన వారికి సందేశాలు పంపుతున్నాయని సమాచారం. ఇప్పటికే విప్రో టెక్నాలజీస్ ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. ఇప్పుడు అన్ని కంపెనీలు అదే దారిని ఎందుకున్నట్లు తెలుస్తోంది.
Massive layoffs in IT industry#layoffs pic.twitter.com/Q7TDEcFlPn
— Hi Warangal (@HiWarangal) April 5, 2020
అంతర్జాతీయంగా అనిశ్చితి నేపథ్యంలో, క్లయింట్ల నుంచి ఆర్డర్ల రాక ఆలస్యం అవుతున్నందున.. తాము తొలుత ఆఫర్ చేసిన వార్షిక వేతన ప్యాకేజీని సగానికి పరిమితం చేస్తున్నామంటూ..’ ఐటీ కంపెనీలు కొత్తగా ఎంపికైన వారికి మెయిల్స్ పంపుతున్నాయట. అందుకు అంగీకరిస్తున్నట్లు అయితే మీరు ఈ ఉద్యోగంలో చేరవచ్చని అందులో హెచ్చరిస్తున్నాయట. అంటే ‘ఇష్టమైతే చేయండి లేదంటే మానెయ్యండి అన్నట్లు ఐటీ కంపెనీలు ఖరాఖండీగా చెప్పేస్తున్నాయన్నమాట’. మరో దారి లేకపోవడంతో వీరు అందుకు తల ఊపుతున్నారట. రెండు.. మూడేళ్లు ఇందులో చేసి మరో కంపెనీకి వెళ్లినా.. అక్కడ ఎక్కువ ప్యాకెజీ అందుకోవచ్చని ఆలోచిస్తున్నారట.
ఇదిలావుంటే.. కొద్దిరోజుల క్రితం విప్రో సంస్థ ప్రెషర్స్ జీతాలను సగానికి తగ్గించిన సంగతి తెలిసిందే. 2022-23 వెలాసిటీ పట్టభద్రుల విభాగంలో శిక్షణ పూర్తిచేసుకున్న ఫ్రెషర్లకు గతంలో రూ.6.5 లక్షల వేతన ప్యాకేజీని ఆఫర్ చేయగా.. దానిని రూ.3.5 లక్షలకు తగ్గించుకుని, విధుల్లో చేరాల్సిందిగా వారికి ఇ-మెయిల్స్ పంపింది. ఈ ఆఫర్‌కు అంగీకరించినట్లయితే వెంటనే విధుల్లో చేరాలని, దీనికి ఓకే అంటే గత ఆఫర్ రద్దవుతుందని అందులో పేర్కొంది. మరోవైపు.. ఉద్యోగుల పనితీరు బాగోలేని వారిని కూడా ఐటీ కంపెనీలు ఇంటికి పంపిస్తున్నాయి. దీంతో ఫేక్ ఎక్సపీరియన్స్ సర్టిఫికెట్స్ పెట్టి ఉద్యోగాలు సాధించిన వారు లబోదిబోమంటున్నారు. ప్రస్తుత ఐటీ ఉద్యోగుల పరిస్థితులపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Wipro asks freshers to settle for half the salary it initially offered them pic.twitter.com/NGZ37a0o88
— Marketing Maverick (@MarketingMvrick) February 20, 2023