భారతదేశంలో ఇ-కామర్స్ ప్రాభవం ఎంత పెరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఏం కొనాలన్నా.. ఆన్ లైన్ లోనే కొనేస్తున్నారు. ఉప్పు, పప్పులు కూడా ఇ-కామర్స్ సైట్లలోనే దొరుకుతున్నాయి. అందుకే ఇప్పుడు వాటి మధ్య పోటీ పెరిగింది. పోటీని తట్టుకునేలా ప్రత్యేక సేల్స్ ని నిర్వహిస్తుంటారు. ఇప్పుడు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ని నిర్వహిస్తోంది.
ఇప్పుడు ప్రాంతంతో సంబంధం లేకుండా అందరూ ఆన్ లైన్ లోనే షాపింగ్ చేయడం ప్రారంభించారు. ఇప్పటికే ఇండియాలో ఎన్నో ఇ-కామర్స్ స్టోర్స్ అందుబాటులో ఉన్నాయి. కొత్త కొత్త ఇ-కామర్స్ సైట్లు కూడా సరికొత్త ఆఫర్స్ తో వస్తున్నాయి. ఇప్పుడు గుండుసూది నుంచి పెద్ద పెద్ద ఎలక్ట్రిక్ వస్తువుల వరకు ఇ-కామర్స్ సైట్లలో కొనుగోలు చేయచ్చు. ఇంతలా ఆన్ లైన్ షాపింగ్ కు డిమాండ్ పెరగబట్టే.. ఆ రంగంలో పోటీ కూడా బాగా పెరిగింది. పెరిగిన పోటీని తట్టుకుని వినియోగదారుల ఆదరణ పొందేందుకు వారికున్న ఒకే ఒక్క మార్గం సేల్స్ నిర్వహించడం. రిపబ్లిక్ డే సేల్, దసరా సేల్, దీపావళి సేల్ అంటూ ఇ-కామర్స్ సైట్లు స్పెషల్ డేస్ లో సేల్స్ నిర్వహిస్తాయి. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ సమ్మర్ సేల్ ని ప్రకటించింది.
అమెజాన్ ప్రైమ్ గ్రేట్ సమ్మర్ సేల్ ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ సేల్ లో ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్ సెస్ అంటూ అన్ని వస్తువులపై క్రేజీ డీల్స్ ని ప్రకటిచింది. ప్రస్తుతానికి సేల్ డేట్, ఆఫర్స్ ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. కానీ, సేల్ కి సంబంధించి అమెజాన్ ప్రైమ్ లో హింట్ ఇచ్చారు. ఈ గ్రేట్ సమ్మర్ సేల్ లో వస్తువులు రూ.99 నుంచే ప్రారంభమవుతున్నాయి. ఇందులో అండర్ రూ.99, అండర్ రూ.199, అండర్ రూ.299, అండర్ రూ.499, బ్లాక్ బస్టర్ డీల్స్, 8పీఎం డీల్స్ ఉన్నాయి. ఫ్యాష్ ప్రొడక్ట్స్ రూ.199 నుంచి స్టార్ట్ కానున్నాయి. హోమ్ అండ్ కిచెన్ రూ.79 నుంచి ప్రారంభం అవుతాయి. మొబైల్స్ పై 40 శాతం వరకు డిస్కౌంట్ ఉంది. టీవీ- అప్లయన్ సెస్ పై 60 శాతం వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి. ఐసీసీఐ, కోటక్ బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం వరకు తగ్గింపు ఉంది. ఈ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మే నెల మొదటి వారంలో ఉంటుందని చెబుతున్నారు. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కు ఇది కాస్త ముందుగానే స్టార్ట్ అవుతుంది.
Amazon Great Summer Sale is coming soon. Will start early for Prime members.#Amazon #AmazonGreatSummerSale pic.twitter.com/1qxoG3oVuG
— Mukul Sharma (@stufflistings) April 27, 2023