ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్స్‌తో తన వినియోగదారులను ఆకట్టుకోవడమే కాక.. మిగతా టెలికాం కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది రిలయన్స్ జియో. తాజాగా మరో ధమకా ఆఫర్ ప్రకటించింది జియో. ఆ వివరాలు..
పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో మనిషి జీవితం ఎంతో సులభతరం అయ్యింది. ముఖ్యంగా వాణిజ్యపరమైన లావాదేవీలు ఎంతో తేలిగ్గా మారిపోయాయి. ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టకుండానే కావాల్సినవి కొనేస్తున్నారు. చెల్లింపులు అయితే ఎంతో సులభతరం అయ్యాయి. అయితే ఈ మారుతున్న టెక్నాలజీతో ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో.. ముప్పులు కూడా అన్నే ఉన్నాయి. మీ ఖాతాలో డబ్బులు ఎప్పుడు? ఎవరు? ఎలా కాజేస్తారో కూడా చెప్పే పరిస్థితి లేదు. ఆన్‌లైన్ షాపింగ్‌ల పేరుతో మోసం చేసేవాళ్లు కొందరైతే.. ఇప్పుడు హ్యాకర్లు […]
నేటి ఆధునిక పోటీ ప్రపంచ యుగంలో టెక్నాలజీ రోజు రోజుకు పెరిగిపోతోంది. దీంతో మారిన పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు ప్రతీ ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్ ఖచ్చితంగా ఉంటుంది. స్కూలుకు వెళ్లే పిల్లాడి నుంచి పొలం పనులకు వెళ్లే ముసలాయన వరకూ ఇలా ప్రతీ ఒక్కరి చేతులో స్మార్ట్ ఫోన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఓ పూట తిండి లేకున్న సరే ఉంటారు కానీ.., చేతిలో సెల్ ఫోన్ లేకుంటే మాత్రం ప్రపంచమంత తలకిందులైనట్లుగా ప్రవర్తిస్తుంటారు. ఇదిలా […]
టెలికాం రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగం సంస్థల మధ్య విపరీతమైన పోటీ ఉంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ప్రైవేట్ రంగంలో రిలయన్స్ జియో ధాటికి మిగతా టెలికాం ఆపరేటర్లు గిలగిలా కొట్టుకుంటున్నాయి. ఎంత ప్రయత్నించినా జియోకు పోటీగా రాలేకపోతున్నాయి. మరోవైపు జియో రోజు రోజుకు విభిన్నమైన ప్లాన్‌లను తీసుకొస్తూ.. కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో జియో మరో సూపర్ ప్లాన్‌తో వినియోగదారులు ముందుకు వచ్చింది. కేవలం 75 రూపాయలకే అన్‌లిమిటెడ్ […]
ఇటీవల హైదరాబాద్ నగరంలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఓ డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇపుడు మైక్రోసాఫ్ట్ ఇండియా ముందుకు వచ్చింది. ఈ కేంద్రాన్ని రూ.1500 కోట్ల వ్యయంతో నెలకొల్పనున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో దీన్ని ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు ప్రభుత్వంతో ఆ సంస్థ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. చర్చలు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యయాలు తక్కువగా […]