ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ షాకింగ్ డెసిజన్ తీసుకుంది. భారత్‌లోని తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో దిగ్గజ ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, డెల్, ఇన్ఫోసిస్ సహా అనేక కంపెనీలు పెద్ద ఎత్తున లేఆఫ్స్ చేపడుతున్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా ఇదే బాటలో ప్రయాణిస్తోంది. ఇటీవలి కాలంలో పెద్ద సంఖ్యలో ఎంప్లాయీస్‌ను తీసేస్తున్న అమెజాన్.. ఇప్పుడు భారత్‌లో భారీ ఎత్తున లేఆఫ్స్ మొదలుపెట్టిందని సమాచారం. ఇండియాలో సుమారు 500 మంది ఉద్యోగులను అమెజాన్ తొలగించిందట. ఈ ఎంప్లాయీస్లో ఎక్కువ మటుకు హ్యూమన్ రీసోర్సెస్, సపోర్ట్ స్టాఫ్, వెబ్ సర్వీసెస్ విభాగాలకు చెందిన వారు ఉన్నారని తెలిసింది. వీరితో పాటు ఇంకొంత మంది గ్లోబల్ ఆపరేషన్స్‌కు పనిచేస్తున్న వారు కూడా ఉన్నారట.
ఆర్థిక మాంద్యం భయాలతో పాటు ఆర్థిక వ్యవస్థలో అస్థిరత లాంటి కారణాల వల్ల తమ ప్రాధాన్యాలకు అనుగుణంగా లేని ఉద్యోగులను అమెజాన్ తీసేస్తోందని సంస్థ సీఈవో ఆండీ జెస్సీ గతంలో వెల్లడించారు. కరోనా తర్వాత ఈ-కామర్స్ సంస్థల ఆదాయాలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. కొవిడ్ టైమ్‌లో ఈ తరహా కంపెనీలకు బాగా డిమాండ్ ఏర్పడటంతో పెద్ద సంఖ్యలో ఎంప్లాయీస్‌ను రిక్రూట్ చేసుకున్నాయి. అయితే కరోనా తర్వాత పూర్వస్థితికి వ్యాపారాలు చేరుకున్న నేపథ్యంలో డిమాండ్ కూడా బాగా పడిపోయింది. వడ్డీ రేట్లు పెరిగిపోవడం, ఆర్థిక మాంద్యం భయపెడుతుండటంతో వినియోగదారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ కారణాలతోనే ఆయా సంస్థలు తమ ఖర్చుల్ని తగ్గించుకునేందుకు గానూ ఉద్యోగులను తీసేస్తున్నాయి.
Seattle-based tech giant #Amazon is letting go of at least 500 #employees in #India, and the process is ongoing, they said.
This is part of the additional layoffs Amazon CEO Andy Jassy announced in late March, impacting about 9,000 employees globally.https://t.co/BOV5uFlqiF— Economic Times (@EconomicTimes) May 16, 2023