తెలంగాణ ఉద్యమ నేత ముఖ్యమంత్రి కేసీఆర్ 69వ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తు, అభిమానులు ఆయనకు తమదైన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ప్రజా నాయకుడు, తెలంగాణ ఉద్యమ నేత ముఖ్యమంత్రి కేసీఆర్ 69వ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి ప్రజల ఆకాంక్ష నెరవేర్చి చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు కేసీఆర్. అన్ని వర్గాల ప్రజలు ఆయనకు తమదైన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు కీలక నేతలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సీఎం కేసీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ‘తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ ట్విట్ చేశారు. అంతేకాదు కేసీఆర్ కి ఆయురారోగ్యాలు కలగాలని.. ఆయన దీర్ఘాయుష్షు తో జీవించాలని దేవుడి దీవెనులు అందాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు. రాజకీయ పరంగా ఇద్దరి మద్య విభేదాలు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో కలిసి ముచ్చటించుకుంటారు. ఒకప్పుడు కేసీఆర్ సైతం టీడీపీలో పలు కీలక బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి పుట్టిన రోజు సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. ఉదయం ఆమె సీఎం కేసీఆర్ కి స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు. అదే విధంగా కేరళా ముఖ్యమంత్రి పినరయి విజయన్.. కేసీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ప్రధాని మోదీ, గవర్నర్ తమిళిసై, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Warm Birthday wishes to Chief Minister of Telangana Sri K Chandrasekhara Rao Garu. May you be blessed with long life and good health.@TelanganaCMO pic.twitter.com/PKgM95eqNk
— N Chandrababu Naidu (@ncbn) February 17, 2023