ఆంధ్రప్రదేశ్.. విజయవాడలో ఏప్రిల్ 28వ తేదీన జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో ప్రత్యేక అతిధిగా రజనీకాంత్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్, చంద్రబాబును పొగుడుతూ.. ప్రశంసల వర్షం కురిపించారు. వెంటనే వైసీపీ మంత్రులు, నాయకులు రజినీకాంత్ పై తీవ్ర విమర్శలు చేశారు
తెలుగు ఇండస్ట్రీలో మహానటుడు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఏప్రిల్ 28న విజవాడలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సూపర్ స్టార్ రజినీకాంత్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్, చంద్రబాబు పై తనదైన స్టైల్లో ప్రశంసలు కురిపించారు. అంతే మరుసటి రోజు రజినీకాంత్ ని టార్గెట్ చేసుకొని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు కురిపించారు. అయితే రజినీ వ్యాఖ్యలను రాజకీయ కోణంలో చూడవొద్దని.. పలువురు సినీ తారలు రజినీకాంత్ కి మద్దతుగా నిలిచారు. నటుడు సుమన్ టాలీవుడ్ నటుడు సుమన్ సంచలన కామెంట్స్ చేశారు. అసలేం జరిగింది? ఎందుకు ఆ వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయో తెలుసుకుందాం!
సినీ పరిశ్రమ గర్వించదగ్గ నటుడు నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలను విజయవాడలో ఏప్రిల్ 28న ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో నటుడు బాలకృష్ణ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ సిఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. రజనీకాంత్ తన ప్రసంగంలో చంద్రబాబునాయుడిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆ వ్యాఖ్యలు కాస్త అధికార పార్టీ నాయకులకు కంటగింపుగా అనిపించాయి. దీంతో వారు రజనీకాంత్ పై విమర్శలు చేశారు. తాజాగా హీరో సుమన్ స్పందిస్తూ.. రజనీకాంత్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేంలేదని చెప్పారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడి హయాంలోనే చాలా అభివృద్ధి జరిగిందని తెలిపారు.
హైదరాబాద్ నగరంపై ప్రత్యేక శ్రద్ధతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఐటి రంగానికి పునాదులు వేసిందే చంద్రబాబు నాయుడని తెలిపారు. ఐటి రంగంలో పెట్టుబడులను ఆహ్వానించి పలు కంపెనీలను హైదరాబాద్ కు తీసుకు వచ్చిన ఘనత చంద్రబాబుదే అని తెలిపారు. నేడు ఐటి రంగంలో ఇంతమంది యువత ఉపాధి పొందుతున్నారంటే కారణం చంద్రబాబే అని స్పష్టం చేశారు. అయినా రజనీకాంత్ ఏ ఒక్క నాయకుడి గురించిగానీ, పార్టీ గురించి గానీ విమర్శించలేదని నటుడు సుమన్ వెల్లడించారు. రజనీకాంత్ మాటల్లో తప్పేం లేదని చెప్పారు. వైసిపి నేతలు రజనీకాంత్ ను విమర్శించడం సరికాదన్నారు.