తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికార, ప్రతిపక్ష నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అధికార పార్టీ పై విమర్శలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రతిపక్ష నేతలు. కొత్త పథకాలు తీసుకువస్తూ ప్రజలను ఆకర్షించే పనిలో తెలంగాణ సర్కార్. గతంలో దళితబంధు పథకాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల బీసీలకు ఒక లక్ష రూపాయల పథకాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. తాజాగా తెలంగాణ సర్కార్ మైనార్టీలకు శుభవార్త వినిపించింది. బీసీల మాదిరిగానే మైనార్టీలకు సైతం ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించాని నిర్ణయించింది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఇటీవల కొత్త పథకాలను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. దళితుల అభ్యున్నతి కోసం.. వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు దళితబంధు పథకం తీసుకు వచ్చారు. బీసీల్లో చేతి వృతులు, కుల వృత్తుల వారికి చేయూతనిచ్చిందుకు లక్ష రూపాల ఆర్థిక సాయం అందించే పథకాన్ని తీసుకువచ్చింది. తాజాగా ఇప్పుడు మైనార్టీలకు శుభవార్త తెలిపింది తెలంగాణ సర్కార్. బీసీల మాదిరిగానే మైనార్టీలకు లక్షరూపాయల సాయం అందించే పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకానికి సంబంధించి ఆదివారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మైనార్టీల ఆర్థిక స్వావలంబనకు ఈ పథకం దోహదపడుతుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుల, మతాలకు అతీతంగా పేదరిక నిర్మూలన కోసం ఈ పథకాన్ని తీసుకువచ్చామని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల పేద ప్రజలను ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా ఆదుకుంటున్న విషయం తెలిసిందే అన్నారు. మైనార్టీల అభివృద్ది, సంక్షేమానికి తెలంగాణ రాష్ట్రం కట్టుబడి ఉందని అన్నారు. మైనార్టీల్లో పేదరికం, వెనుకబాటు తనాన్ని నిర్మూలించేందుకు టీ సర్కార్ కృషి చేస్తుందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు సమానంగా అండగా ఉంటామని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలకు 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం పై జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం. pic.twitter.com/9SQ3NluFZh
— Telugu Scribe (@TeluguScribe) July 23, 2023