తెలంగాణ ప్రజలు గర్వించే విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నిర్మించిన విషయం తెలిసిందే. రేపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సెక్రటేరియట్ భవనాన్ని ప్రారంభించనున్నారు.
హైదరాబాద్ లో ఎన్నో అద్భుతమై చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ప్రగతికి చిహ్నంగా.. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా కొత్త సెక్రటేరియట్ భవనం నిలవనుంది. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హాస్ ను తలపించేలా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింభించేలా సకల హంగులతో నిర్మితమైన సచివాలయం రేపు ఆదివారం.. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా పార్కులు, వినోద కేంద్రాలు మూసివేస్తున్నట్లు హెచ్ఏండిఏ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులు మీదుగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో ఉన్న పలు పార్కులు, వినోద కేంద్రాలను ఆదివారం,30 వ తేదీన మూసి వేస్తున్నట్లుగా హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్ మెంట్ అధారిటీ ప్రకటించింది. కొత్తగా ఏర్పాటు చేసిన సెక్రటేరియట్ భవనం పరిసరాల్లో నెలకొనే రద్దీ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లేజర్ షోలను సైతం మూసి వేస్తున్నట్లు హెచ్ఎండీఏ వెల్లడించింది.
ఇదిలా ఉంటే నగరంలోని సచివాలయం పరిసరాల్లో పోలీసులు ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. పలు మార్గాల ద్వారా వేళ్లేలా రూట్ మ్యాప్ ని హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే విడుదల చేశారు. హుసేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్ బాబు తెలపారు. అదే విధంగా పీవీ విగ్రహం, నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ వరకు ఇరువైపు ట్రాఫిక్ పరిస్థితిని బట్టి ట్రాఫిక్ నిలిపివేస్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నట్లు సీపీ తెలిపారు.