మనిషి.. టెక్నాలజీని అందిపుచ్చుకుని అద్భుతాలు చేస్తున్నాడు. రోజురోజుకూ సరికొత్త ఆవిష్కరణలు చేస్తూ.. తన జీవన విధానాన్ని స్మార్ట్ గా మార్చుకుంటున్నాడు. మార్కెట్లోకి ప్రతిరోజూ అనేక రకాల గాడ్జెట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఎంతలా అంటే ఫోన్‌తో చేసే పనులు కళ్ల జోళ్ల(స్మార్ట్ గ్లాసెస్)తో చేయడం అన్నమాట. ఇప్పటికే ఆ దిశగా ప్రయోగాలు కూడా సాగుతున్నాయి. తాజాగా చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ తొలిసారి ‘షావోమీ మిజియా’ పేరుతో స్మార్ట్ గ్లాసెస్‌ను విడుదల చేసింది.
ధర:
షావోమీ మిజియా’ స్మార్ట్ గ్లాసెస్ ధర చైనీస్ కరెన్సీలో 2,699 యుయాన్లుగా ఉంది. అంటే.. ఇండియన్ కరెన్సీలో రూ.31,500 అన్నమాట.
ఫీచర్స్ అదుర్స్..
షియోమీ మిజియా గ్లాసెస్ స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే.. ఈ గ్లాసెస్‌లో సోనీ మైక్రో OLED డిస్‌ప్లేతో నిర్మించారు. 50MP క్వాడ్-బేయర్ ఫోర్-ఇన్-వన్ వైడ్ యాంగిల్ కెమెరా మరియు 8MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలను అమర్చారు. వీటీతో 5x ఆప్టికల్ జూమ్, 16x హైబ్రిడ్ జూమ్ కూడా చేయొచ్చు. 3GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ సదుపాయం ఉంది. దీంతో డేటాను సేవ్ చేసుకోవచ్చు. Wi-Fi, బ్లూటూత్ 5.0 కనెక్టింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇక.. బ్యాటరీ విషయానికొస్తే..10W ఛార్జింగ్ సపోర్ట్ తో 10,200mAh బ్యాటరీ సామర్త్యం ఉంది. 100 నిమిషాల నాన్‌స్టాప్ వీడియోని క్యాప్చర్ చేయగలదని కంపెనీ పేర్కొంది.
Xiaomi’s Mijia Glasses Camera are now up for pre-order in it’s crowdfunding site at $370.
Specs:
• Ram: 3gb, Rom: 32gb
• a custom Snapdragon 8-based chipset
• weight: 100g
• a dual cam setup with 5X optical zoom
• a Sony’s OLED display, peak: 3000nits, on eyes 1800nits pic.twitter.com/GKg0hhJ85B— Vinci (@Vinci_Medias) August 2, 2022
ఇదీ చదవండి: గూగుల్ మ్యాప్స్ లో సరికొత్త ఫీచర్ .. స్ట్రీట్ వ్యూ.. ఉపయోగించండిలా..!
ఇదీ చదవండి: గూగుల్ ఫొటోస్ లో ఉన్న.. మీ పిక్స్ బయట వాళ్లు చూడకుండా.. ఇలా హైడ్ చేసేయండి!