గూగుల్ ఫొటోస్.. ఈ యాప్ ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్ లోనూ డిఫాల్ట్ యాప్ గా ఉంటుంది. ఈ యాప్ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ ను బ్యాక్ అప్ చేయడానికి అలాగే షేర్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ యాప్ సహాయంతో మన పర్సనల్ ఫొటోస్ ఎవరైనా చూస్తారేమో అన్న భయం మనలో ఉంటుంది. అలా చూడకుండా ఉండేదుకు మంచి ఉపాయం ఉంది. ఈ ట్రిక్ తో మీ ఫోటోలను ఎవరికి కనబడకుండా దాచేయచ్చు. అదెలాగో.. మీరు చూసేయండి. గూగుల్ ఫొటోస్ లో ఉన్న ఫోటోలను హైడ్ చేయండిలా.. మొదటగా గూగుల్ ఫొటోస్ యాప్ ను ఓపెన్ చేసి.. ఇమేజ్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇమేజ్ ను స్వైప్ అప్(Swipe Up) చేయగానే.. Move to Locked Folder ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇందుకు మరో ఆప్షన్ కూడా ఉంది. ఇమేజ్ ఓపెన్ చేయగానే.. Right side కార్నర్ లో మూడు చుక్కలపై క్లిక్ చేసి.. Move to Locked Folder ఎంచుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేయగానే.. ఫోటో ఆటో మ్యాటిక్ గా Locked Folderలోకి వెళ్తుంది. ఇలా లాక్డ్ ఫోల్డర్ లోకి వెళ్లిన ఇమేజ్.. మీకు మరెక్కడా(వాట్సాప్, గ్యాలరీ..) కనిపించదు. ఇప్పుడు Locked Folder ఓపెన్ చేయాలనుకుంటే.. Libraryపై క్లిక్ చేసి Utilities సెలక్ట్ చేసుకోవాలి అక్కడ Locked Folder ఫోల్డర్ కనిపిస్తుంది.