స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, ఇయర్ బడ్స్ అంటూ అన్నీ స్మార్ట్ గ్యాడ్జెట్స్ వాడుతున్నారు. కానీ, గ్లాసెస్ మాత్రం సాధారణమైనవి వాడుతుంటారు. ఎందుకంటే స్మార్ట్ గ్లాసెస్ చాలా ఖరీదు కాబట్టి. అయితే ఇప్పుడు మార్కెట్ లో కేవలం రూ.949కే స్మార్ట్ గ్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో పాటలు వినచ్చు, ఫోన్ మాట్లాడవచ్చు, గేమ్స్ కూడా ఆడుకోవచ్చు.
మనిషి.. టెక్నాలజీని అందిపుచ్చుకుని అద్భుతాలు చేస్తున్నాడు. రోజురోజుకూ సరికొత్త ఆవిష్కరణలు చేస్తూ.. తన జీవన విధానాన్ని స్మార్ట్ గా మార్చుకుంటున్నాడు. మార్కెట్లోకి ప్రతిరోజూ అనేక రకాల గాడ్జెట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఎంతలా అంటే ఫోన్‌తో చేసే పనులు కళ్ల జోళ్ల(స్మార్ట్ గ్లాసెస్)తో చేయడం అన్నమాట. ఇప్పటికే ఆ దిశగా ప్రయోగాలు కూడా సాగుతున్నాయి. తాజాగా చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ తొలిసారి ‘షావోమీ మిజియా’ పేరుతో స్మార్ట్ గ్లాసెస్‌ను విడుదల చేసింది. ధర: షావోమీ మిజియా’ స్మార్ట్ […]